Jabardasth Varsha : చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తున్న జబర్దస్త్ వర్ష
Jabardasth Varsha : జబర్దస్త్ కామెడీ షోలో లేడీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష. హైపర్ ఆది టీమ్ నుంచి జబర్దస్త్ కి పరిచయం అయింది. ఇక ఆ తర్వాత భాస్కర్ టీమ్ లో ఇమ్మాన్యుయెల్ తో కలిసి చేస్తున్న స్కిట్ లతో బాగా పాపులర్ అయింది. ఇక ఇమ్మాన్యుయెల్, వర్ష మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే రూమర్స్ తో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ లవ్ ట్రాక్ పేరుతోనే ఎక్కువ ఫేమ్ సంపాదించుకుంది.
ఇమ్మాన్యుయోల్ కామెడీ పంచ్ ల టైమింగ్ కి వర్ష క్యూట్ నెస్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక జబర్దస్త్ లో వర్ష వాయిస్ పై కూడా జోకులు వేస్తూ ఆటపట్టిస్తుంటారు. అలాగే పలు స్పెషల్ ఈవెంట్స్ లలో కూడా సందడి చేస్తోంది. ఓ ఈవెంట్ లో ఇమ్మాన్యుయెల్ వర్షాలకు పెళ్లి కూడా జరిపించడంతో ఇక ఈ ఇద్దరూ లవ్ లో ఉన్నారని అనుకున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ మంచి గుర్తింపైతే తెచ్చుకుంది.
Jabardasth Varsha instagram video viral
అంతకుముందు వర్ష తెలుగు సీరియల్స్ లో కూడా నటించింది. అభిషేకం, తూర్పు పడమర, ప్రేమఎంత మదురం వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది. కాగా వర్ష సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ప్రస్తుతం వర్ష ఇన్ స్టాలో పోస్ట చేసిన వీడియో వైరల్ అవుతోంది. చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ ఆకట్టుఉంటోంది.
View this post on Instagram