Jabardasth Vasrha : వేడి పుట్టించిన వర్ష.. జబర్దస్త్ డ్యాన్స్‌తో హల్చల్
Jabardasth Vasrha : జబర్దస్త్ వర్ష ఇప్పుడు ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్‌లో నటిస్తూ వచ్చినా కూడా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ షోలో నటించిన రెండు మూడు ఎపిసోడ్‌లు మాత్రం ఓవర్ నైట్ స్టార్‌ను చేసేసింది. అలా వర్ష గత రెండు మూడేళ్ల నుంచి జబర్దస్త్ షోలో దుమ్ములేపుతోంది. అయితే ఈ మధ్య శ్రీదేవీ డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ అంటూ వేరే షోల్లోనూ హల్చల్ చేస్తోంది.

Jabardasth Vasrha Peformance In Sridevi Drama Company
వర్ష, ఇమాన్యుయేల్ జోడిది ఓ మోస్తరు వరకు అందరూ ఎంజాయ్ చేశారు. దాన్నే అలుసుగా తీసుకుని వెగటు పుట్టించేలా స్కిట్లు వేశారు. పదే పదే ఎమోషనల్ డ్రామాలు క్రియేట్ చేసేందుకు చూశారు. చివరకు ఈ ఇద్దరికీ పెళ్లి అనే నాటకం ఆడుతూ ఈవెంట్ కూడా చేశారు. దీంతో ఈ జోడి మీద నెటిజనం ఒక్కసారిగా భగ్గుమన్నారు. యూట్యూబ్‌లో ఆ ఇద్దరినీ కామెంట్లతో చీల్చిచెండాడారు.
Jabardasth Vasrha :డ్యాన్సుతో దుమ్ములేపిన వర్ష :

Jabardasth Vasrha Peformance In Sridevi Drama Company
అయితే అప్పటి నుంచి వర్ష, ఇమాన్యుయేల్ ట్రాక్‌ను కాస్త తగ్గించారు. కానీ ఈ మధ్య మళ్లీ వీరిద్దరి పైత్యాన్ని చూపిస్తున్నారు. తాజాగా వదిలిన ప్రోమోలో వర్ష దుమ్ములేపేసింది. వర్షకు సరిగ్గా డ్యాన్సులు వేయడం రాదు.. బొంగురు గొంతు కూడా ఉంటుంది. వాటిపై ఆది, ఇమాన్యుయేల్ ఇప్పటికే లెక్కలేనన్ని సెటైర్లు వేశారు. కానీ తాజాగా వర్ష వేసిన స్టెప్పులకు ఒంట్లో వేడిపుట్టాల్సిందే. హాట్ డ్యాన్స్‌తో హీట్ పెంచేసింది.
