Janaki Kalaganaledu 10 Nov Today Episode : రామా, జానకి ముద్దు పెట్టుకుంటుండగా చూసి మైరావతి, జ్ఞానాంబ షాక్.. జానకికి పెద్ద శిక్ష వేసిన మైరావతి
Janaki Kalaganaledu 10 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 నవంబర్, 2021, బుధవారం, 168 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైరావతి.. జానకికి మొక్కలు నాటాలంటూ చెబుతుంది. మరోవైపు మల్లికకు పెద్ద చెట్టు ఎక్కాలని చెబుతుంది. అదిగో పిల్లా ఆ మొక్కలు తర్వాత నాటుదువు గానీ.. బర్రెలు వచ్చే టైమ్ అయింది. ముందు నీళ్లు మోసి కుడితి కలిపి.. పేడకడులు ఎత్తు అని జానకికి చెబుతుంది మైరావతి. అమ్మమ్మ గారు నేను దిగుతాను.. అని మల్లిక అంటుంది. ఏయ్… అంటూ బెదిరిస్తుంది. దీంతో మల్లిక చెట్టు పైనే ఉండి అన్ని చూస్తుంది. మరోవైపు జానకి.. బావిలో నుంచి నీళ్లు తోడుతూ ఉంటుంది.

janaki kalaganaledu 10 november 2021 full episode
నీళ్లు తీసుకెళ్లి బర్రెలకు కుడితి తయారు చేస్తుంది జానకి. తర్వాత పేడ కడులు ఎత్తి బొచ్చెలో వేస్తుంది. కానీ.. తనకు ఆ పని కొత్త కాబట్టి.. తీయలేకపోతుంది. వాసన తట్టుకోలేకపోతుంది. ఇంతలో రామా తనకు ఫోన్ చేస్తాడు. నానమ్మ మీకు పేడకడులు తీయమని చెప్పిందట కదా. మీరు ఆపని చేయలేరు. వద్దండి. నేను వస్తున్నాను అంటుంది. పర్లేదు అండి నేను ఏ పని అయినా చేస్తాను. మీరు రావద్దు అని చెబుతుంది. రేపు మనం కలిసి ఉండాలంటే.. అమ్మమ్మ గారు చెప్పిన పనులన్నీ చేయాల్సిందే.. అని చెబుతుంది జానకి.
ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. మైరావతితో కలిసి తను చేస్తున్న పనిని చూస్తుంది. జానకి గురించి నాకు తెలుసు అత్తయ్య గారు. తను ఎంత కష్టమైనా భరిస్తుంది. తనకు అప్పగించిన పనిని తూచా తప్పకుండా చేస్తుంది.. అంటుంది జ్ఞానాంబ. అవునా.. మరి జానకి మొగుడికి ఎందుకు ఫోన్ చేసినట్టు.. మొగుడిని ఎందుకు రమ్మన్నట్టు.. అంటుంది మైరావతి. లేదు అత్తయ్య గారు.. జానకి ఎప్పుడూ అలాంటి పనులు చేయదు అని చెబుతుంది జ్ఞానాంబ.
Janaki Kalaganaledu 10 Nov Today Episode : జానకి బ్యాగ్ తన రూమ్ లో ఉండటం చూసి రామా షాక్
నిజమే.. నీ కోడలు గట్టి పిండమే.. ఇక్కడైతే గెలిచింది. చూద్దాం.. ముందుంది కదా మొసళ్ల పండుగ అని అనుకుంటుంది మైరావతి. మరోవైపు మగవాళ్లు అంతా ఓ చోట చేరి ముచ్చట్లు పెట్టుకుంటారు. రామా బావ… జానకి అక్క చాలా మంచి అమ్మాయి.. ఎంత చదువుకున్నా.. ఎంతో ఒదిగి ఉంటుంది అని అంటారు అందరూ. మరోవైపు తన రూమ్ లో ఉన్న జానకి బ్యాగ్ ను చూస్తాడు రామా. జానకి బ్యాగ్ ఇక్కడుందేంటి.. ఈ బ్యాగ్ ను తీసుకెళ్లి ఎలా జానకి గారికి ఇవ్వాలి. నానమ్మేమో తనను కలవొద్దని చెప్పింది అని అనుకుంటాడు.

janaki kalaganaledu 10 november 2021 full episode
ఇంతలో జానకి.. తన బ్యాగ్ కోసం రూమ్ అంతా వెతుకుతుంది. తన బ్యాగ్ చూశావా అని జానకి.. మల్లికను అడుగుతుంది. లేదు.. నేను చూడలేదు అంటుంది. బావ గారి రూమ్ లో పనివాళ్లు ఎవరైనా పెట్టారేమో అంటుంది మల్లిక. వెళ్లి చూడు అంటుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే రామా రూమ్ కు వస్తుంది జానకి. అప్పుడే రామా బ్యాగ్ తీసుకొని బయటికి రాబోతాడు. ఇంతలో మల్లిక బయటి నుంచి డోర్ పెడుతుంది. దీంతో ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు. మీరెందుకు వచ్చారండి.. నేను బ్యాగ్ తెచ్చి ఇచ్చేవాడిని కదా.. ఇప్పుడు నానమ్మ చూస్తే కొంపలు అంటుకుపోతాయండి అంటాడు రామా.
మరోవైపు మల్లిక.. పరుగు పరుగున వెళ్లి మైరావతికి అసలు విషయం చెబుతుంది. జానకి, రామా ఇద్దరూ రూమ్ లో ఉన్నారని.. చాలా సేపు అయిందని చెబుతుంది. దీంతో మైరావతి షాక్ అవుతుంది. వెంటనే వెళ్లి రూమ్ ఓపెన్ చేస్తారు. అందరూ వస్తారు. రామా, జానకి ముద్దు పెట్టుకోవడం చూసి మైరావతి వెంటనే జానకిపై సీరియస్ అవుతుంది. బ్యాగ్ కోసం వచ్చాను అన్నా కూడా మైరావతి వినదు. నీకు చదువుకున్నాననే పొగరు తలకెక్కింది. నీ అహం తగ్గిస్తా అంటూ జానకిని బయటికి తీసుకెళ్తుంది మైరావతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.