Janaki Kalaganaledu 24 Sep Today Episode : జ్ఞానాంబకు వారసుడిని ఇవ్వడానికి సిద్ధపడ్డ జానకి.. జానకి, రామా ఫస్ట్ నైట్.. దానికి రామా ఒప్పుకుంటాడా? తన ఐపీఎస్ కలకు.. వారసుడు అడ్డొస్తాడా?

Janaki kalaganaledu 24 september friday 135 episode highlights
Janaki Kalaganaledu 24 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 24 సెప్టెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 135 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి గారు.. మీరు తొందరగా ఐపీఎస్ ఐపోవాలి.. పాఠాలు త్వరగా చెప్పమని వాళ్లకు చెప్పండి.. అంటాడు కార్తీక్. జానకి లోపలికి వెళ్తుంది. వెళ్లేముందు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరీ వెళ్తుంది జానకి. అప్పుడే మానస అనే అమ్మాయి కూడా కోచింగ్ కు వస్తుంది. తన అన్నయ్య తనను తీసుకొస్తాడు. రామాను అక్కడ చూసి ఈ పూతరేకు గాడికి ఇక్కడ ఏం పని అని అనుకొని అతడి దగ్గరికి వచ్చి ఆగుతాడు. ఏం రామచంద్రా ఏంటి ఇక్కడ ఉన్నావు. 8 వ తరగతి కూడా దాటని నీకు.. సివిల్స కోచింగ్ సెంటర్ దగ్గర నీకేం పని అంటాడు.

Janaki kalaganaledu 24 september friday 135 episode highlights
కట్ చేస్తే.. లోపల తన ఫ్రెండ్ అభి కలుస్తాడు. ఫీజు కట్టేశాను. ఇక ఐపీఎస్ సాధించడమే నా కల.. అని అభితో అంటుంది. సివిల్స్ కోచింగ్ సెంటర్ లో నీకేం పని అని అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలా దిక్కులు చూస్తున్నావేంటి.. అని అడుగుతాడు. ఫంక్షన్ ఉందట.. స్వీట్స్ ఆర్డర్ ఇచ్చారు.. అందుకే ఆర్డర్ తీసుకుందామని వచ్చాను.. అంటాడు. ఇంతలో జానకి, అభి.. ఇద్దరూ బయటికి వస్తుంటారు.

Janaki kalaganaledu 24 september friday 135 episode highlights
మన క్లాస్ మేట్ మౌనిక కాల్ చేస్తుంది అనగానే.. కాల్ ఎత్తుతుంది జానకి. ఫోన్ మాట్లాడుతూ అక్కడే ఉంటుంది. జానకి వస్తుందేమోనని టెన్షన్ పడుతుండటంతో వీడెందుకు ఇంత కంగారు పడుతున్నాడు అని అనుకొని.. నీ మీద నాకు ఎందుకో డౌట్ గురూ. ఒకరోజు నువ్వు బుక్ షాప్ లో కొత్త కొత్త పుస్తకాలు కొనడం చూశాను. ఈరోజు ఇక్కడ ఉన్నావు. ఆరోజు బుక్స్ కొనడానికి.. ఈరోజు ఇక్కడ ఉండటానికి ఏదో లింక్ ఉంది.. ఏంటి గురు మ్యాటర్ అంటే.. మ్యాటర్ లేదు.. గీటర్ లేదు వచ్చిన పని అయిపోయింది.. నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి జానకి రాకముందే బండి తీస్తాడు రామా. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఓకే జానకి బై అని చెప్పి అభి వెళ్లిపోతాడు. ఆ వ్యక్తి కూడా వెళ్లిపోగానే.. మళ్లీ రామా వచ్చేస్తాడు. తనను బండి ఎక్కించుకొని తీసుకెళ్తాడు.

Janaki kalaganaledu 24 september friday 135 episode highlights
కట్ చేస్తే.. ఓ పిల్లాడిని ఎత్తుకొని తెగ సంబురపడి పోతుంటుంది జ్ఞానాంబ. ఇంతలోనే జ్ఞానాంబ భర్త వచ్చి పిల్లాడిని ఇవ్వు. నేను ఎత్తుకుంటాను అంటాడు. ఎవరు ఈ బాబు అంటే లీలావతి మనవడు అంటుంది. ఆవిడ కూతురు వచ్చింది. ఆ బాబుతో కాసేపు ఆడుకుంటారు ఇద్దరూ. ఏంట్రా మనవడా అలా చూస్తున్నావు.. అంటాడు.
Janaki Kalaganaledu 24 Sep Today Episode : జానకికి ఇష్టమైన చింతకాయలు తినిపించిన రామా
ఇంతలో మార్గమధ్యంలో బండి ఆపుతాడు రామా. ఓ చింత చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు రామా. మీకు చింతకాయలు అంటే ఇష్టం కదా. అందుకే చింతచెట్టు దగ్గరికి తీసుకొచ్చా.. అంటాడు. తర్వాత చింతకాయలు కొట్టి ఇస్తాడు. తినండి అని చెబుతాడు. కొన్ని తిని.. మరికొన్ని ఇంటికి పట్టుకెళ్దాం అంటాడు.

Janaki kalaganaledu 24 september friday 135 episode highlights
కట్ చేస్తే.. మల్లిక.. లీలావతి కూతురుకు సమాన్లు సర్దుతుంది. సరుకుల కోసం మీ అమ్మ నిన్ను పంపిస్తుంది. డబ్బుల కోసం మీ అమ్మ వస్తుంది.. అని చెబుతుంది. అవును.. మల్లిక మీ అత్తయ్యకు చిన్నపిల్లలు అంటే తెగ ఇష్టంగా ఉంది. నువ్వు ఒకసారి డాక్టర్ ను కలవలేకపోయావా.. అంటుంది. నాకేం సమస్య లేదు. నువ్వు వచ్చిన పని అయిపోయింది. నీకొడుకు మాఇంట్లో ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు.. వెళ్లు అంటుంది. పిల్లాడికి సెరెలాక్ తినిపిస్తూ ఆలోచిస్తుంటుంది జ్ఞానాంబ. మనకు కూడా మనవడో.. మనవరాలో ఉంటే బాగుంటుంది కదా.. అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఆ భగవంతుడు మనకు ఇప్పటి వరకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు అంటుంది జ్ఞానాంబ. త్వరలోనే నీ చిన్నకోడలో, పెద్ద కోడలో నీకు మనవడిని అందిస్తారులే.. అంటాడు. ఇంతలో లీలావతి కూతురు పిల్లాడిని తీసుకొని వెళ్లిపోబోతుంది. దీంతో అప్పుడప్పుడు వీడిని తీసుకురా.. కాసేపు ఆడుకుంటాను. మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది.. అని చెబుతుంది జ్ఞానాంబ.

Janaki kalaganaledu 24 september friday 135 episode highlights
కట్ చేస్తే.. జానకి రెడీ అవుతుంది. అందంగా ముస్తాబు అవుతుంది. అత్తయ్య గారికి వారసుడిని ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను.. అని జానకి చెబుతుంది. దీంతో రామా కూడా సంతోషపడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Janaki kalaganaledu 24 september friday 135 episode highlights