Janaki Kalaganaledu 27 Dec Tomorrow Episode : రామా బాధను తట్టుకోలేక అఖిల్ చదువు బాధ్యతలను తీసుకున్న జానకి.. ఇంతలో మరో ట్విస్ట్.. జరగబోయేది ఇదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 27 Dec Tomorrow Episode : రామా బాధను తట్టుకోలేక అఖిల్ చదువు బాధ్యతలను తీసుకున్న జానకి.. ఇంతలో మరో ట్విస్ట్.. జరగబోయేది ఇదేనా?

 Authored By gatla | The Telugu News | Updated on :26 December 2021,3:00 pm

Janaki Kalaganaledu 27 Dec Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కాదు. తిరిగి రేపు అంటే 27 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 201 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అఖిల్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని.. మల్లిక జ్ఞానాంబకు చెబుతుంది. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఏరా అఖిల్.. మల్లిక చెప్పేది నిజమేనా.. అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అవునమ్మా అంటాడు. నిన్ను ఎంతో కష్టపడి చదివిస్తే నువ్వు చేసేది ఇదా.. అని జ్ఞానాంబ, గోవిందరాజు.. అఖిల్ ను తిడతారు. కానీ.. మల్లిక.. ఆ తప్పును జానకి మీద నెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అసలు అఖిల్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? మీ పెద్ద కోడలు.. అని అంటుంది. జానకి వల్లే అఖిల్ ఫెయిల్ అయ్యాడని చెబుతుంది. జానకి గిటార్ కొనివ్వడం వల్లనే అఖిల్ ఫెయిల్ అయ్యాడని చెబుతుంది. దీంతో అఖిల్ ను తీసుకొని జ్ఞానాంబ స్వీట్ షాపు దగ్గరికి వెళ్తుంది.

janaki kalaganaledu 27 december 2021 episode highlights

janaki kalaganaledu 27 december 2021 episode highlights

స్వీటు కొట్టు దగ్గర ఉన్న జానకి.. టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నుంచి కోచింగ్ కు ఎలా వెళ్లాలి.. అని భయపడుతుంది. అలాగే రెండు మూడు రోజుల్లో కేకులు తయారు చేసి షాపులో విక్రయించాలని అత్తయ్య గారు చెప్పారు. నాకు కేకులు తయారు చేయడం రాదని తెలిస్తే అత్తయ్య ఏమంటుందోనని టెన్షన్ పడుతుండగా రామా చూసి.. ఏమైంది జానకి గారు అని అడుగుతాడు. అదే విషయం చెబుతుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ.. అఖిల్ ను తీసుకొని స్వీట్ షాపు దగ్గరికి వస్తుంది. అఖిల్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడని చెబుతుంది. అందుకే ఈరోజు నుంచి ఖార్ఖానాలో పని చేయించండి అని చెబుతుంది. ఈరోజు నుంచి స్వీటు కొట్టు, ఖార్ఖానా పనులు చూసుకుంటాడని చెప్పడంతో రామా, జానకి షాక్ అవుతారు.

ఏరా అఖిల్.. నీకు ఏం తక్కువ చేశాంరా. ఇలా ఎందుకు చేశావురా. కనీసం నువ్వయినా బాగా చదువుకొని ప్రయోజకుడివి అవుతావని అనుకున్నా కానీ.. ఇలా చేస్తావని అనుకోలేదు అంటాడు. ఈ ఒక్కసారి తప్పయిపోయింది. ఇంకోసారి బాగా చదువుకొని పరీక్షలు బాగా రాసి పాస్ అవుతా అంటాడు అఖిల్.

జానకి కూడా అదే విషయం చెబుతుంది. అఖిల్ కు ఒక చాన్స్ ఇద్దాం అంటుంది జానకి. కానీ… నువ్వు మాట్లాడకు అంటుంది జ్ఞానాంబ. అంతా నీవల్లే అని సీరియస్ అవుతుంది జ్ఞానాంబ. దీంతో జానకికి నోట మాట రాదు. నువ్వు సొంత పెత్తనం చేసి అఖిల్ కు గిటార్ కొనిచ్చి వాడు పరీక్షల్లో తప్పేలా చేశావు అంటుంది. అందుకే.. ఇక నుంచి వీడికి చదువు లేదు గిదువు లేదు అంటుంది.

Janaki Kalaganaledu 27 Dec Tomorrow Episode : జ్ఞానాంబ నిర్ణయానికి షాక్ అయిన రామా, జానకి

వెంటనే ఖార్ఖానాలో పనిలో పెట్టు అని రామాకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. అఖిల్.. ఖార్ఖానాలో పనున్నీ చేస్తాడు. చాలా బాధపడతాడు రామా. ఏం చేయాలో అర్థం కాదు. నా తమ్ముళ్లు అయినా బాగా చదువుకొని వాళ్లు మంచి పొజిషన్ లో ఉంటే చూడాలని అనుకున్నా అని జానకితో చెప్తూ బాధపడతాడు రామా. తన బాధను చూసి జానకికి ఏం చేయాలో అర్థం కాదు.

వెంటనే జ్ఞానాంబ వద్దకు వెళ్లి.. అఖిల్ చదువు బాధ్యతను నేను తీసుకుంటా అని చెబుతుంది. ఇక నుంచి అఖిల్ కు నేను ట్యూషన్ చెబుతా అంటుంది జానకి. తను పాస్ అయ్యేలా నేను చేస్తాను అంటుంది జానకి. ఒకవేళ వాడు సరిగ్గా చదవక మళ్లీ పరీక్షల్లో ఫెయిల్ అయితే అని అడుగుతుంది జ్ఞానాంబ.

నాది హామీ అని చెబుతున్నాను కదా అత్తయ్య అంటుంది జానకి. ఒకవేళ మీరు అన్నట్టు జరిగితే.. మీరు నా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఏ శిక్ష వేసినా భరిస్తాను అంటుంది జానకి. వీడు చేసే పొరపాట్లకు నువ్వు శిక్ష అనుభవించే పరిస్థితి రాకూడదు అంటుంది జ్ఞానాంబ.

నేను కూడా చూస్తాను. నీకు ఒక అవకాశం ఇస్తాను. నువ్వు ట్యూషన్లు చెప్పినా.. అఖిల్ పాస్ కాకపోతే నేను ఏం చేస్తానో నువ్వు కూడా చూస్తావు.. అని చెబుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది