Janaki Kalaganaledu 29 Nov Episode Highlights : జానకిని ఇంట్లో నుంచి ఎలాగైనా వెళ్లగొట్టేలా చేయాలని మల్లిక మరో ప్లాన్.. ఈసారైనా వర్కవుట్ అవుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 29 Nov Episode Highlights : జానకిని ఇంట్లో నుంచి ఎలాగైనా వెళ్లగొట్టేలా చేయాలని మల్లిక మరో ప్లాన్.. ఈసారైనా వర్కవుట్ అవుతుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :28 November 2021,1:39 pm

Janaki Kalaganaledu 29 Nov Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 29 నవంబర్ 2021, 181 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోతుండగా ఆడ్డుకొని తన ప్రాణాలు కాపాడుతాడు రామా. తనకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్తుండగా రామాకు మధ్యలో జానకి కనిపిస్తుంది. జానకిని చూసి రామా షాక్ అవుతాడు. జానకి గారు అని పిలుస్తాడు కానీ.. జానకి పలకదు. ఏదో పరధ్యానంలో వెళ్తుంటుంది.తనకు తానే మాట్లాడుకుంటూ వెళ్తుంది జానకి. మీకు మాటివ్వడమే కాదు అత్తయ్య గారు.. ఆ మాటను నిలబెట్టుకుంటాను. నా ఐపీఎస్ కలను వదులుకుంటాను అని చెప్పి జానకి వెళ్తుంటుంది. తన ఐపీఎస్ పుస్తకాలను కూడా పాత సామాన్ల వ్యక్తికి అమ్మేస్తుంది జానకి.

janaki kalaganaledu 29 november 2021 episode highlights

janaki kalaganaledu 29 november 2021 episode highlights

తర్వాత చాలా బాధపడుతుంది. ఇక తన ఐపీఎస్ కలను జానకి వదులుకున్నట్టే. కానీ.. తన మనసులో మాత్రం తన ఐపీఎస్ కలను వదులుకున్నాననే బాధ మాత్రం అలాగే ఉండిపోతుంది.మరోవైపు ఖార్ఖానాలో నెయ్యి అయిపోయిందంటే.. మల్లికను ఇచ్చి రమ్మంటాడు గోవిందరాజు. దానికి కుంటి సాకులు చెబుతుంది మల్లిక. దీంతో జానకి ఇస్తా అని చెబుతుంది. జానకిని మరోసారి బుక్ చేయడం కోసం ప్లాన్ వేస్తుంది మల్లిక. జానకి నెయ్యి ఇచ్చి రాగానే.. తను వెళ్లి వాంతులు చేసుకునే మందును ఆ నెయ్యిలో కలిపివస్తుంది.

పూతరేకుల తయారీ కోసం ఆ నెయ్యిని వాడుతారు పనివాళ్లు. ఆ పూతరేకులను తిన్నవాళ్లకు వాంతులు అవడం కోసం ప్లాన్ చేస్తుంది మల్లిక. దాన్ని జానకి మీద నెట్టేయడం తన ప్లాన్ అన్నమాట. ఆ తర్వాత జ్ఞానాంబతో తిట్టించి ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టాలనేది మల్లిక ప్లాన్.

మరోవైపు జానకి బాధపడుతూ ఉండటం చూసి షాక్ అవుతాడు రామా. ఎందుకు బాధపడుతున్నావు.. దాన్ని కనిపించకుండా దాచుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు జానకి. నీ ఐపీఎస్ కలను అమ్మ కోసం వదులుకొని ఇప్పుడు బాధపడుతున్నావా? అంటాడు రామా.

Janaki Kalaganaledu 29 Nov Episode Highlights : జానకిని ఓదార్చిన రామా.. అత్తయ్య గారి కోసం ఏదైనా చేస్తా అన్న జానకి

నేను ఏమీ బాధపడటం లేదండి అంటుంది జానకి. అత్తయ్య గారికి మాట ఇచ్చాను కాబట్టి.. ఆ మాట ప్రకారం నడుచుకుంటున్నా.. అంటుంది జానకి. అప్పుడు బాధ ఎందుకు ఉంటుంది నాకు అంటుంది జానకి. కానీ.. మీరు పైకి ఇలా మాట్లాడటానికి మీ మనసులో ఎంత బాధ అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను అంటాడు రామా.

మరోవైపు జానకి ఫ్రెండ్ శ్రావణి.. కొట్టుకు వచ్చి రామాకు క్షమాపణలు చెబుతుంది. రామా గారు మీ అమ్మగారికి క్షమాపణలు చెప్పానని చెప్పండి. నేను ఆంటి గారి దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెబుదామనుకున్నాను కానీ.. నాకు మొహం చెల్లలేదు అంటుంది శ్రావణి.

రామా గారు.. స్వతహాగా జానకి చాలామంచిది. వాళ్ల అన్నయ్య అమెరికా వెళ్లడం కోసమే.. తను చదువును త్యాగం చేసింది అని చెబుతుంది జానకి. జానకి మీద ప్రేమతోనే అలా మాట్లాడాను కానీ.. ఆంటి గారి మీద కోపంతో కాదు అంటుంది శ్రావణి.

తనకు ఐపీఎస్ అంటే ప్రాణం కదా. ఇప్పుడు చదువుకోను అన్నాను. ఈ విషయం గురించి నీతో ఏదైనా మాట్లాడారా అని అంటాడు రామా. లేదండి.. జరిగిన పరిస్థితులకు భయపడిపోయి అలా అని ఉంటుంది. తను ఐపీఎస్ కలను వదిలేయడం అంటే ఒక రకంగా తన ప్రాణాన్ని వదిలేయడమే అంటుంది శ్రావణి.

మరోవైపు జ్ఞానాంబ పక్కింట్లో ఉండే ఆమె వచ్చి.. ఏమైంది జానకిని క్షమించావా? అంటుంది జ్ఞానాంబతో. నీ కొడుకు కన్నా తక్కువ చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పావు కదా. కానీ.. చివరకు చదువుకోలేదని అబద్ధం చెప్పి నిన్ను మోసం చేసింది జానకి. తనను నువ్వు ఎలా క్షమిస్తావు అని అడుగుతుంది జ్ఞానాంబను.

చాలామంది ఆడపిల్లలకు కాస్త చదువు ఉంటే అహం, కొంచెం అందంగా ఉండే పొగరు ఉంటాయి. కానీ.. నా కోడలు మాత్రం అటు చదువు.. ఇటు అందం ఉన్నా సరే.. అణుకువకు పెట్టింది పేరు. ఈ జానకి.. ఈ జ్ఞానాంబకు తగ్గ కోడలు అని అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది