Janaki Kalaganaledu 30 Dec Today Episode : జ్ఞానాంబ ఇంటికి అభి రావడంతో జానకి, రామా షాక్.. జానకి ఐపీఎస్ కోచింగ్ విషయాన్ని అభి జ్ఞానాంబకు చెప్పేస్తాడా?
Janaki Kalaganaledu 30 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 204 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఖార్ఖానాలో పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జానకి పూజలో కూర్చుంటుంది. పూజ తర్వాత జానకితో ప్రశాంతంగా మాట్లాడుతుంది జ్ఞానాంబ. నీ మీద ఇప్పుడు నాకు చాలా నమ్మకం కలిగింది. రోజూ ఎక్కువ అవసరం లేదు కానీ.. ఓ మూడు నాలుగు కేకులు తయారు చేస్తే చాలు అంటుంది జ్ఞానాంబ. పూజ పూర్తవ్వగానే అందరూ ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు దిలీప్ ఖార్ఖానాకు వచ్చి వెన్నెలను దొంగచాటుగా చూస్తాడు. వెన్నెల అంటూ పిలుస్తాడు. అటు వైపు రా అంటాడు. ఇంతలో జ్ఞానాంబ చూసి ఏంటి అని అడుగుతుంది. పదండి అంటుంది.

janaki kalaganaledu 30 december 2021 full episode
మరోవైపు జానకి క్లాస్ మెట్ అభి.. ఇంటికి వస్తాడు. జానకి జానకి అని పిలుస్తాడు. మల్లిక డోర్ తీసి ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేను జానకి క్లాస్ మెట్ ను అంటాడు అభి. ఎందుకు వచ్చావు అంటాడు. జానకితో మాట్లాడటానికి వచ్చాను అంటాడు. చేతుల్లో బ్యాగ్ ఏంటి.. అంటే జానకికి పుస్తకాలు ఇవ్వాలి అంటాడు. పుస్తకాలు అనగానే మల్లిక తెగ హడావుడి చేస్తుంది. ఇంతలో జ్ఞానాంబ, గోవిందరాజు, జానకి, రామా అందరూ ఇంటికి వస్తారు. అభిని చూసి జానకి, రామా షాక్ అవుతుంది. మల్లిక ఎవరు ఆ అబ్బాయి అంటుంది జ్ఞానాంబ. మన జానకి క్లాస్ మెట్ అట అంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ జానకి వైపు చూస్తుంది. మరోవైపు వెన్నెల.. దిలీప్ ను కలుస్తుంది. ఏమైంది మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పావా అని అడుగుతాడు.
చెప్పాను కదా దిలీప్. ప్రేమ అనే మాట ఎత్తుతేనే మా అమ్మ చంపేస్తుంది అని. మా ఇంట్లో ఎవ్వరైనా సరే.. మా అమ్మ నిర్ణయించిన సంబంధాన్నే చేసుకోవాలి తప్ప.. ప్రేమ, పెళ్లి అనే మాట వినిపించకూడదు అని చెబుతుంది అంటుంది వెన్నెల. పోనీ నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడనా అంటాడు దిలీప్.
వద్దు అంటుంది వెన్నెల. మరి మన ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసేదెలా అంటున్న సమయంలోనే కన్నబాబు అక్కడికి వస్తాడు. ఇలా.. అంటూ అప్పుడు దిలీప్, వెన్నెల మాట్లాడుకున్న వీడియోను చూపిస్తాడు. మొన్న మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే నేనే తీశాను. ఏం వెన్నెల.. చూస్తుంటే మీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టున్నారు. నేను వచ్చి మీ ఇంట్లో ఈ వీడియో చూపించి నేను ఒక దారికి తీసుకురానా అంటాడు కన్నబాబు.
ఇంతలో దిలీప్ నువ్వు వెళ్లు అంటుంది వెన్నెల. దిలీప్ వెళ్లిపోయాక.. వద్దు మీరు ఆ పని మాత్రం చేయకండి అని వేడుకుంటుంది వెన్నెల. ఈ వీడియోను మీ ఇంట్లో వాళ్ల ముందు పెడతాను.. మీ ఇంటి పరువును రోడ్డున లాగుతాను అంటాడు కన్నబాబు. దీంతో మీకు దండం పెడతాను. ఈ పని మాత్రం అస్సలు చేయకండి.. అంటుంది వెన్నెల.
ఇవన్నీ చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఒక్కదానివే రేపు మా తోటకు రావాలి. అక్కడ మనిద్దరమే పర్సనల్ గా కూర్చొని సీరియస్ గా చర్చించుకొని సామరస్యంగా ఒక అండర్ స్టాండింగ్ కు వద్దాం సరేనా. రేపు సాయంత్రం 6 గంటలకు అల్లా నువ్వు మా తోటలో ఉండాలి. లేదంటే నేను మీ ఇంటికి వచ్చి ఈ వీడియో చూపించను.. ఊరు ఊరంతా పోస్టర్లు వేయిస్తాను.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సూరిబాబు.
Janaki Kalaganaledu 30 Dec Today Episode : అభి ఎందుకు వచ్చాడో తెలుసుకునేందుకు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగిన జ్ఞానాంబ
కట్ చేస్తే.. అభిని కూర్చోబెట్టి మాట్లాడుతారు జ్ఞానాంబ, గోవిందరాజు. ఏమబ్బాయి.. నువ్వు మా జానకి ఒకే కాలేజీలో చదువుకున్నారా అని అడుగుతుంది జ్ఞానాంబ. అవును ఆంటి.. అంటాడు. ఒకే కాలేజీ మాత్రమే కాదు. ఒకే క్లాస్. ఇంటర్, డిగ్రీ రెండూ ఇద్దరం కలిసే చదువుకున్నాం అంటాడు అభి.
అవునా.. పెళ్లిలో నిన్ను చూసినట్టు గుర్తులేదే అంటుంది జ్ఞానాంబ. అప్పుడు నేను వేరే రాష్ట్రంలో ఉన్నాను.. అందుకే కుదరలేదు అంటాడు అభి. సరే.. ఇప్పుడు ఏ పని మీద వచ్చావు అంటాడు గోవిందరాజు. ఎందుకంటే.. మొన్న నేను రామా గారితో మాట్లాడినప్పుడు మీ షాపులో పూతరేకులు చాలా స్పెషల్ అని చెప్పారు.
అందుకే మా అమ్మ వాళ్లకు రెండు మూడు కేజీల పూతరేకులు తీసుకెళ్దామని వచ్చాను అంటాడు అభి. మా రామాతో ఇంతకుముందు ఒకసారి మాట్లాడాను అని చెప్పావు కదా.. మా రామా నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో మళ్లీ అందరూ షాక్ అవుతారు.
అంటే.. జానకికి పెళ్లయిన తర్వాత శుభాకాంక్షలు చెబుదామని ఫోన్ చేశాను అండి. అప్పుడు రామా గారితో మాట్లాడాను అండి అంటాడు. చికిత.. ఓ నాలుగు కేజీల పూత రేకులు పెట్టించు అంటుంది జ్ఞానాంబ. రామా.. అభికి మన ఇల్లు చూపించు అంటుంది జ్ఞానాంబ.
మల్లికకు అస్సలు ఏం అర్థం కాదు. అభి చెప్పింది అంతా కట్టుకథ అనిపిస్తుంది అని విష్ణుతో అంటుంది. పూతరేకులు కావాలంటే స్వీటు షాపునకు వెళ్లాలి కానీ.. ఇంటికి రావడం ఏంటి.. ఏదో ఉంది.. కనిపెడతా.. కుక్కలా కనిపెడతా అని అనుకుంటుంది మల్లిక.
మరోవైపు ఏంటి అభి నువ్వు ఎంత టెన్షన్ పెట్టావు.. అంటుంది జానకి. మీక పూతరేకులు కావాలంటే నాకు ఫోన్ చేస్తే నేనే తెచ్చేవాడిని కదా.. మా ఇంటికి వచ్చి ఇంత టెన్షన్ పెట్టావు అంటాడు రామా. నేను వచ్చింది పూతరేకుల కోసం కాదు అంటాడు అభి.
జానుకు ఇది ఇవ్వడం కోసం వచ్చాను అంటాడు. మీ అమ్మ గారికి అబద్ధం చెప్పాను అంటాడు. అది ఏ ఫైల్ అని అడుగుతుంది జానకి. మొన్న మన కోచింగ్ అకాడెమీలో జరిగిన పరీక్షలో నువ్వు సెకండ్ హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నావు అని చెబుతాడు అభి. దీంతో జానకి ఫుల్ ఖుషీ అవుతుంది.
నువ్వు ఈరోజు అకాడెమీకి రాలేదు కదా.. అందుకే డైరెక్ట్ గా వచ్చాను అంటాడు అభి. దీంతో జానకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.