Janaki Kalaganaledu 31 Oct Today Episode : జ్ఞానాంబ ముందే నీకు పిచ్చి పట్టిందా? అని మల్లికపై జానకి సీరియస్.. దెబ్బకు జ్ఞానాంబ షాక్
Janaki Kalaganaledu 31 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం మాత్రమే ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ సోమవారం 1 నవంబర్ 2021, 161 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. నీలావతి.. జ్ఞానాంబ ఇంటికి వచ్చి.. నీ పెద్ద కోడలు డిగ్రీ వరకు చదువుకుందట కదా.. అంటూ హేళన చేస్తుంది. నా కూతురును చేసుకొమ్మంటే 10వ తరగతి వరకు చదివిందని చేసుకోలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో.. అంటూ హేళనగా మాట్లాడి.. అటువంటి కోడలును ఇంకా ఇంట్లో ఉంచుకోవడం ఏంటి.. బయటికి పంపించక అన్నట్టుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది నీలావతి.

janaki kalaganaledu 31 october 2021 episode highlights
ఆ తర్వాత రామా కొట్టుకు వెళ్తాడు. కొట్టులో పరధ్యానంగా ఉంటాడు. కస్టమర్ వచ్చి 50 కిలోల పూతరేకులు కావాలని అడిగితే ఏమాత్రం కూడా స్పందించకుండా అలాగే ఉండిపోతాడు రామా. రేపు ఉదయం వరకే కావాలి.. అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాడు ఆ వ్యక్తి. దీంతో సరే అంటాడు కానీ.. ఆ పనులేవీ ప్రారంభించడు. పూతరేకుల ఆర్డర్ ను మరిచిపోతాడు రామా. ఉదయం లేవగానే.. కన్నబాబు వచ్చి కూడా రామాతో చిన్న విషయానికే గొడవ పెట్టుకొని వెళ్తాడు. అసలు.. రామా కండిషన్ ఏమాత్రం సరిగ్గా ఉండదు. ఎప్పుడూ తన తల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
రాత్రి ఇంటికి వచ్చాక కూడా జ్ఞానాంబ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మా అమ్మ నాకు మాత్రమే శిక్ష వేయలేదు. తను కూడా శిక్ష వేసుకుంది.. అని జానకితో అంటాడు రామా. దీంతో జానకి షాక్ అవుతుంది. ఆ విషయాన్ని జ్ఞానాంబ వింటుంది. తను కూడా బాధపడుతుంది. అసలు.. నేను దురదృష్టవంతురాలిని. నేనే బంగారం లాంటి తల్లికొడుకు మధ్య చిచ్చు పెట్టాను అని అంటుంది జానకి.
Janaki Kalaganaledu 31 Oct Today Episode : వంటగదిలోకి అడుగు పెట్టిన మల్లిక
కట్ చేస్తే మల్లిక ఫుల్ జోరులో ఉంటుంది. చాలా ఖుషీగా ఉంటుంది. ఎంతో ఎంజాయ్ చేస్తూ వంట చేస్తుంటుంది. ఇంతలో చికిత వచ్చి ఏం జరుగుతోంది అంటుంది. అయినా నువ్వు వంట చేయడం ఏంటి అని అడుగుతుంది మల్లికను. అప్పుడు అత్తయ్య ఏం చెప్పింది.. నువ్వు వంట చేయడానికి వీలు లేదు. ఈరోజు నుంచి జానకి చేస్తుంది అని చెప్పింది కదా. కానీ.. ఇప్పుడు జానకి త్వరలోనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది కాబట్టి.. ఇక నుంచి నేనే వంట చేయాలి కదా. నిన్నటి దాకా జానకి వంటింట్లో గరిట తెప్పింది. పెత్తనం చెలాయించింది.. అంటుంది.

janaki kalaganaledu 31 october 2021 episode highlights
తర్వాత జానకి వచ్చి నువ్వెందుకు వంట చేస్తున్నావు. నేను చేస్తాను అని అంటుంది జానకి. కానీ.. మల్లిక మాత్రం జానకిని అనరాని మాటలు అంటుంది. నువ్వు చదువుకున్నాననే అహంకారాన్ని పొగరును చూపించి బావగారి మీద అహంకారాన్ని చూపిస్తావని.. దాని వల్ల బావ గారికి ఏదైనా అవుతుందని అత్తయ్య గారు బాధపడుతున్నారు.. అని అనగానే మల్లిక నోర్మూయ్.. అంటూ జానకి సీరియస్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. ఇలాగేనా మాట్లాడేది. పిచ్చిగాని పట్టిందా నీకు. పదే పదే ఇలా మాట్లాడకూడదు అనే బుద్ధి లేదా నీకు అంటూ సీరియస్ అవుతుంది. ఈ విషయాలను జ్ఞానాంబ వింటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.