Janaki Kalaganaledu 8 March Today Episode : మల్లిక ప్లాన్ వర్కవుట్.. జ్ఞానాంబను అనరాని మాటలు అన్న లీలావతి.. మరోవైపు జానకి నెలతప్పిందని సంతోషపడ్డ జ్ఞానాంబ.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 8 March Today Episode : మల్లిక ప్లాన్ వర్కవుట్.. జ్ఞానాంబను అనరాని మాటలు అన్న లీలావతి.. మరోవైపు జానకి నెలతప్పిందని సంతోషపడ్డ జ్ఞానాంబ.. ఇంతలో మరో ట్విస్ట్  

Janaki Kalaganaledu 8 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 252 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు పెళ్లికూతురుగా రెడీ అవ్వమంటే అయ్యాను కానీ.. మళ్లీ ఈ స్వీట్ల గోల ఏంటి అని అంటుంది జ్ఞానాంబ. దీంతో అత్తయ్య గారు.. మీరు పెళ్లయిన కొత్తల్లో మీరు మామయ్య గారు ఒకే విస్తరిలో ఎలా […]

 Authored By gatla | The Telugu News | Updated on :8 March 2022,11:30 am

Janaki Kalaganaledu 8 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 252 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు పెళ్లికూతురుగా రెడీ అవ్వమంటే అయ్యాను కానీ.. మళ్లీ ఈ స్వీట్ల గోల ఏంటి అని అంటుంది జ్ఞానాంబ. దీంతో అత్తయ్య గారు.. మీరు పెళ్లయిన కొత్తల్లో మీరు మామయ్య గారు ఒకే విస్తరిలో ఎలా భోజనం చేశారో.. ఇప్పుడు కూడా అలాగే ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాలి అంటుంది జానకి. మా పెళ్లయి పాతికేళ్లు అయింది. ఇప్పుడేంటి ఇవన్నీ అంటుంది జ్ఞానాంబ. ఏంటి జ్ఞానం.. అలా మాట్లాడుతావు. మన పెళ్లి అయి పాతికేళ్లు అయినా.. మనం ఇంకా యంగే అంటాడు గోవిందరాజు.

janaki kalaganaledu 8 march 2022 full episode

janaki kalaganaledu 8 march 2022 full episode

చివరకు హల్వా తీసి నేను మొదటిసారి మీ అమ్మకు హల్వా తినిపించాను అంటాడు గోవిందరాజు. ఇప్పుడు కూడా అదే తినిపిస్తాను అంటాడు గోవిందరాజు. తర్వాత అదే చేతితో జ్ఞానాంబ కూడా గోవిందరాజుకు తినిపిస్తుంది. ఇంట్లో వాళ్లు అంతా ఇంత సంతోషంగా ఉండటం నేను చూడలేకపోతున్నాను. మనం ప్రయోగించిన బాణం లీలావతి ఇంకా రాలేదు ఏంటి అబ్బ అని అనుకుంటుంది. అంతలోనే లీలావతి వస్తుంది. జ్ఞానాంబ.. ఏదో వేడుక జరుగుతున్నట్టుంది. నీ కట్టు.. బొట్టు అన్నీ మారిపోయినట్టునాయి. ఏంటి విశేషం అంటుంది లీలావతి. దీంతో అవును.. మా అత్తయ్య, మామయ్య గారి 25వ పెళ్లి వేడుక అంటుంది మల్లిక. అలాగా.. రాకూడని టైమ్ లో వచ్చినట్టున్నాను.. తర్వాత వస్తానులే అంటుంది లీలావతి.

దీంతో పర్లేదులే లీలావతి. ఎలాగూ వచ్చావు కదా. పిల్లలందరితో కలిసి భోం చేసి వెళ్లు అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే జ్ఞానాంబ.. తప్పకుండా తినే వెళ్తాను. ఈ పెళ్లి రోజు వేడుకలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కానీ.. నీ పరిస్థితిని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది జ్ఞానాంబ అంటుంది లీలావతి.

ఏం మాట్లాడుతున్నావు నువ్వు. ఎందుకు బాధగా ఉంది అని అడుగుతుంది జ్ఞానాంబ. మీరు సంతోషంగా ఉన్న సమయంలో ఇలా మాట్లాడటం తప్పే. ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా అనిపిస్తోంది. మీ పెళ్లి రోజును సంబురంగా జరుపుకుంటున్నావు కానీ.. ఈ వయసులో మనవళ్లు, మనవరాళ్ల పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఇంట్లో ఈ వింతలు, విడ్డూరాలు ఏంటని నవ్విపోతారు అంటుంది లీలావతి.

దీంతో అత్తా.. ఇది కరెక్టేనా.. ఆనందంగా ఉన్న సమయంలో లాంటి మాటలు మాట్లాడొచ్చా అంటాడు అఖిల్. నీకు తెలియదు అంటుంది. వెన్నెల కూడా లీలావతిపై సీరియస్ అవుతుంది. వెన్నెల నీకు కోపం రావడం చాలా సహజం. ఏంటమ్మాయి.. ఏమన్నావు. సంతోషంగా ఉన్న సమయమా… అంటుంది లీలావతి.

Janaki Kalaganaledu 8 March Today Episode : లీలావతిపై సీరియస్ అయిన గోవిందరాజు

మనవడు, మనవరాలును ఎత్తుకొని ఆడించే అదృష్టం లేనందుకు మీ అమ్మ ఎంత బాధపడుతోందో నీకు ఏం తెలుసు.. అంటుంది లీలావతి. దీంతో గోవిందరాజు సీరియస్ అవుతాడు. గట్టిగా తన మీద అరుస్తాడు. ఇవాళ కాకపోయినా ఇంకో ఏడాదికో ఈ ఇంట్లో మనవడో, మనవరాలో తిరుగుతారు.. అంటాడు.

దీంతో ఇవి నేను అంటున్న మాటలు కాదు. అవి వైజయంతి మాటలు.. అంటుంది లీలావతి. పెళ్లయి ఇన్నేళ్లు అయినా నీ పెద్ద కోడలు జానకి కడుపు పండలేదు. అక్కడేమో వైజయంతికి సవాల్ విసిరి వచ్చింది. ఏడాది లోపు నా పెద్ద కోడలు పండంటి బిడ్డకు జన్మనిస్తుందని.. మా ఇంట్లో బారసాల చేస్తామని సవాల్ చేసింది.

ఇప్పుడేమో.. ఏడాది తిరిగినా నీ పెద్ద కోడలు మాత్రం నీళ్లు పోసుకోలేదు అంటుంది. దీంతో కోపంతో జ్ఞానాంబ లోపలికి వెళ్లిపోతుంది. లీలావతి వచ్చి సంతోషాన్ని మొత్తం చెడగొట్టేసింది అని అంతా అనుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఎవరో ఒకరు పిలవకపోతే లీలావతి అత్త కరెక్ట్ గా అదే సమయానికి ఎలా వస్తుంది అని అఖిల్.. రామాను అడుగుతాడు.

దీంతో ఏం అవుతుందో అని అనుకుంటుంది మల్లిక. లీలావతి పెద్దమ్మ చెప్పింది నిజమే కదా.. అంటుంది మల్లిక. వైజయంతి ఫంక్షన్ లో అత్తయ్య గారే.. జానకి గురించి మాట్లాడారు కదా అంటుంది మల్లిక. నిజం చెబితే అందరికీ లోకువే. జానకియే కదా.. ఇప్పటి వరకు పిల్లలను కనకుండా ఉన్నది.. అంటూ ఏదేదో మాట్లాడుతుంది మల్లిక.

లీలావతి గురించి.. తన మనస్తత్వం గురించి నీకు తెలియదా చెప్పు.. అని జ్ఞానాంబకు సర్దిచెబుతాడు గోవిందరాజు. పిల్లలు.. మన పెళ్లి రోజు వేడుకను జరిపించి.. చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు బాధపడితే ఇంకా బాధపడతారు అంటాడు.

నేను బాధపడుతోంది.. లీలావతి ఏదో మాట్లాడింది అని కాదు. నా కోడళ్ల విషయంలో ఒక అత్తగా నా బాధ్యత నేను మరిచిపోయాను అని అంటుంది జ్ఞానాంబ. వైజయంతి బారసాల వేడుకలో మనవళ్లను, మనవరాళ్లను ఎత్తుకునే యోగం నీకు లేదు అని వైజయంతి అన్నప్పుడు.. వచ్చే సంవత్సరం కల్లా నా పెద్ద కోడలు బిడ్డను కంటుంది.. అని సవాల్ విసిరాను.

కానీ.. ఆ తర్వాత ఏడాది అయినా నా పెద్ద కోడలు ఎందుకు ఇంకా బిడ్డను కనలేదు అనే విషయం నేను ఎందుకు మరిచిపోయాను. నా కోడళ్ల సమస్యను నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను అని అంటుంది జ్ఞానాంబ. నా నిర్లక్ష్యమే లీలావతి లాంటి వాళ్లు మాట్లాడే అవకాశం ఇచ్చింది అంటుంది జ్ఞానాంబ.

ఉదయం లేవగానే జానకి వాంతులు చేసుకుంటుంది. జానకి వాంతులు చేసుకోవడం చూసి.. జానకి నెలతప్పిందేమో అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఇదే విషయాన్ని గోవిందరాజుకు చెబుతుంది. దీంతో ఇద్దరూ సంతోషిస్తారు. వెళ్లి లీలావతికి స్వీట్లు ఇస్తుంది జ్ఞానాంబ. కానీ.. జానకి వాంతులు చేసుకుంది ఫుడ్ పడక అనే విషయం జ్ఞానాంబ తెలుసుకోలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది