Jr Ntr : వార్ 2 లో ఎన్టీఆర్ విలనా ?? ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుండె పగిలే బ్రేకింగ్ న్యూస్ !
Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే త్వరలో ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ హండ్సమ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే యుద్ధ భూమిలో ఎదురుచూస్తున్నట్లు హృతిక్ రోషన్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. దీంతో అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందించి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
అయితే ఈ మల్టీ స్టారర్ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా కాకుండా విలన్ గా నటిస్తున్నాడని సమాచారం. ప్రతి నాయకుడు పాత్రకు ఎన్టీఆర్ అయితే పక్కాగా సూటవ్వడంతో పాటు నటన పరంగా తను మాత్రమే న్యాయం చేయగలడని నమ్మి ఎన్టీఆర్ ని ఒప్పించినట్లు వినిపిస్తుంది. విలన్ పాత్ర అయినా హీరోకి దీటుగా ఉంటుందని తెలుస్తుంది. నెగిటివ్ పాత్ర అయినా తారక్ అందుకే ఒప్పుకున్నాడని తెలుస్తుంది. హీరో పాత్ర కంటే ఎక్కువగా విలన్ పాత్రకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని వాదన. ఈ విషయంపై సినిమా యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తారక్ విలన్ పాత్రను ఎలా తీసుకుంటారో అన్నది పెద్ద విషయం. ఇప్పటివరకు ఎన్టీఆర్ ని హీరో గానే చూశారు. జై లవకుశలో నెగిటివ్ పాత్ర చేసిన అందులో త్రిపాత్రాభినయం చేశాడు. కాబట్టి పూర్తిగా విలన్ అనుకోలేం. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాజిటివ్ క్యారెక్టర్ చేసిన ఆయన క్యారెక్టర్ నిడివి తక్కువ ఉండడంతో అభిమానులు రచ్చ చేశారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో హర్ట్ అయ్యే తారక అభిమానులు బాలీవుడ్లో విలన్ గా నటిస్తాడు అంటే హీరో చేతిలో చావు దెబ్బలు తింటాడు అంటే ఊరుకుంటారో లేదో చూడాలి.