Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఆవేదన.. మా హీరోకే ఎందుకు ఇలా …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఆవేదన.. మా హీరోకే ఎందుకు ఇలా …?

 Authored By prabhas | The Telugu News | Updated on :18 August 2022,9:40 pm

Jr NTR : ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత అంర్జాతీయ స్థాయి లో గుర్తింపు దక్కించుకున్నాడు. విదేశీ మీడియా సంస్థలు కూడా ఎన్టీఆర్‌ యొక్క నటన గురించి ప్రశంసలు కురిపించారు. అలాంటి ఎన్టీఆర్‌ తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ 30 సినిమా డైలమాలో పడ్డట్లు అయ్యింది. ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సిన ఎన్టీఆర్ కొరటాల కాంబో సినిమా ను ఇంకా కూడా కనీసం పట్టాలెక్కించలేదు. అదుగో ఇదుగో అంటూ వాయిదా లు వేస్తూ వస్తున్నారు.

అసలు ఎన్టీఆర్ సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయిన సమయంలో నిర్మాత కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ఎన్టీఆర్‌ స్థాయికి తగ్గట్లుగా కథను రెడీ చేసేందుకు సమయం పడుతుంది.. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్‌ ల యొక్క సినిమా అవ్వడంతో నందమూరి అభిమానులు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు. కాని సినిమా మాత్రం ఇంకా కూడా పట్టాలు ఎక్కలేదు. అది ఇంకా ఎన్ని నెలలు కు షూటింగ్‌ ప్రారంభం అవుతుంది అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఎన్టీఆర్‌ మరియు కొరటాల గతంలో జనతా గ్యారేజ్‌ సినిమా తో వచ్చారు.

Jr NTR and koratala siva movie shooting update fans are unhappy

Jr NTR and koratala siva movie shooting update fans are unhappy

ఆ సినిమా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకున్నది లేదు. అయినా కూడా ఎన్టీఆర్‌ అవకాశం ను కొరటాలకు ఇచ్చాడు. కాని ఇప్పుడు కొరటాల శివ ఆ ఛాన్స్ ను వినియోగించుకోలేక పోతున్నాడు. ఏడాది కాలంగా ఎన్టీఆర్‌ షూటింగ్ లేక పోవడంతో ఖాళీగా ఉన్నాడు. పాపం ఎన్టీఆర్ కి మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఆర్‌ ఆర్‌ పూర్తి అవ్వక ముందే కొరటాల శివ పట్టాలెక్కించాలనుకున్నారు. కానీ ఆ సినిమా వచ్చి చాలా కాలం అయినా కూడా ఇంకా షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టడం లేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది