Devara Movie : బిగ్ బ్రేకింగ్ : లీక్ అయిన జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ దేవర స్టోరీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devara Movie : బిగ్ బ్రేకింగ్ : లీక్ అయిన జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ దేవర స్టోరీ !

 Authored By aruna | The Telugu News | Updated on :20 May 2023,1:01 pm

Devara Movie : ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ ను హైదరాబాదులోని పలు పరిసర ప్రాంతాలలో, రామోజీ ఫిలిం సిటీ లో పూర్తి చేశారు. ఇక మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి ‘ దేవర ‘ అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో ఎన్టీఆర్ నల్లని దుస్తులు ధరించి, పొడవాటి కత్తి పట్టుకొని, సేవలతో నిండి ఉన్న పడవలో ప్రయాణం చేస్తూ నిల్చుని ఉన్నాడు. ఈ పోస్టర్ తో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా స్టోరీ కాస్త బయటికి వచ్చినట్లుగా తెలుస్తుంది. భయం అనేది తెలియకుండా బ్రతుకుతున్న అడవి మృగాలకు అతడిని చూస్తే వణుకు పుడుతుంది అనే లైన్ మీద ఈ సినిమాను తీస్తున్నాను అని కొరటాల సినిమా ముహూర్తం రోజే తెలిపారు. అయితే ఇప్పుడు పూర్తిస్థాయిలో స్టోరీ బయటికి లీక్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సముద్ర తీరాన స్మగ్లర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనితో పోటీగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇదే వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య మొదటి నుండి కొన్ని గొడవలు ఉంటాయి. ఒకానొక టైంలో సముద్ర నడిబొడ్డున స్మగ్లింగ్ గూడ్స్ తో ప్రయాణిస్తున్న ఎన్టీఆర్ గ్యాంగ్ ని సైఫ్ అలీఖాన్ చంపేస్తాడు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దేవరకొడుకు అంటే మరో ఎన్టీఆర్ వాళ్ళ రాజ్యంలోకి దిగుతాడు.

JR NTR Devara Movie story leak

JR NTR Devara Movie story leak

చివరికి ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేది స్టోరీ. దీంతో ఈ సినిమా స్టోరీ కామన్ గా అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ చిన్నప్పటినుండి చూస్తూ వస్తున్నాం. మళ్లీ అలాంటి స్టోరీ తోనే సినిమా రావడం పెద్ద సాహసమే. కొరటాల ఈ సినిమాను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకుని తీయకపోతే ఆయన గత సినిమా ఆచార్యలాగే ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాఫ్ అవుతుంది. కానీ కొరటాల శివ పై అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు ఎందుకంటే ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న కొరటాల ఈ సినిమాను కరెక్ట్ గా తీస్తాడని అందరూ అనుకుంటున్నారు. అసలు ఆచార్య సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఎన్టీఆర్ ఈ సినిమాను చేస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మరి కొరటాల ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది