Jr Ntr : సీఎం.. సీఎం అంటూ ఫ్యాన్స్ అరుపులు.. స్టేజ్ పై నుండి కిందకి వెళ్లిపోతానన్న ఎన్టీఆర్
ప్రధానాంశాలు:
Jr Ntr : సీఎం.. సీఎం అంటూ ఫ్యాన్స్ అరుపులు.. స్టేజ్ పై నుండి కిందకి వెళ్లిపోతానన్న ఎన్టీఆర్
Jr Ntr : అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ సందడి చేశాడు. ఇక ఎన్టీఆర్‌ని చాలా రోజుల తర్వాత చూసిన ఫ్యాన్స్ తెగ హంగామా చేశారు. ఇతర సెలెబ్రిటీల్ని మాట్లాడనివ్వకపోవడం, ఇతరులు మాట్లాడుతూ ఉంటే అరుపులతో డిస్టర్బెన్స్ వంటివి చేశారు. చివరకు విజయశాంతి స్పీచుని కూడా అడ్డుకున్నారు. ఆ సమయంలో విజయశాంతి నవ్వుతూనే అసహనం వ్యక్తం చేసింది.

Jr Ntr : సీఎం.. సీఎం అంటూ ఫ్యాన్స్ అరుపులు.. స్టేజ్ పై నుండి కిందకి వెళ్లిపోతానన్న ఎన్టీఆర్
Jr Ntr ఫ్యాన్స్ హంగామా..
ఎన్టీఆర్ సైతం తన ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఉండమంటారా? పొమ్మంటారా? అన్న టైపులో సైగ చేశాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మధ్య ఇలానే ప్రతీ ఈవెంట్లో హంగామా చేస్తున్నారు. రీసెంట్‌గా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ ఎన్టీఆర్ అభిమానులతో దద్దరిల్లిపోయింది. ఇక ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చే వరకు, ఎన్టీఆర్ వంతు వచ్చే వరకు ఆగలేకపోయారు.
తాజాగా విజయశాంతి ఎంతో సీరియస్‌గా స్పీచ్ ఇస్తుంటే అందులో ఎన్టీఆర్ అభిమానులు అరుపులే ఎక్కువ అయ్యాయి. అసలు విజయశాంతి స్పీచుని విననివ్వకుండా చేశారు. ఆ అరుపులు చూసి విజయశాంతి కూడా స్పీచ్ ఆపేసింది. బాబూ నీ ఫ్యాన్స్ ఉత్సాహం ఎక్కువగా ఉంది.. చూస్తుంటే భయంకరంగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ఇక ఎన్టీఆర్ సైతం ఫ్యాన్స్‌ని వార్న్ చేశాడు. ఉండాలా? పోవాలా? మాట్లాడనివ్వండి అంటూ సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
సైలెంట్ గా ఉంటారా? కిందకి వెళ్లిపోమంటారా?#vijayashanthi మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అరుస్తుంటే సైలెంట్ గా ఉండండి లేదంటే వెళ్ళిపోతాను అని సైగ చేసిన @tarak9999 #ArjunSonOfVyjayanthi #NandamuriKalyanRam pic.twitter.com/msde4wQT5l
— greatandhra (@greatandhranews) April 12, 2025