Jr NTR : తారకరత్న కోసం ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ పని చేసిన ఎన్టీఆర్ .. చివరికి ఇలా బయటపడటంతో !!
Jr NTR : ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు స్టార్ సెలబ్రిటీస్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇటీవల నందమూరి తారక రత్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18న రాత్రి 9 గంటల 40 నిమిషాలకు మృతి చెందారు. ఈ వార్త విన్న అభిమానులు ఎంతో కృంగిపోయారు. దాదాపుగా 23 రోజులు ఆసుపత్రిలోని చికిత్స తీసుకున్న తారకరత్నను దక్కించుకోలేకపోయారు. ఇక బాలకృష్ణ తారకరత్న ఆసుపత్రి పాలైన దగ్గరి నుంచి చివరిదాకా అన్ని తానై దగ్గరుండి చూసుకున్నారు.
తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యతలను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటానని అలేఖ్య రెడ్డికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తారకరత్నకు ఎన్టీఆర్ తో ఉన్న రిలేషన్షిప్ బయటపడింది. ఇక తారకరత్న సినిమాలలో అంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఫైనాన్షియల్ గా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తారకరత్నకు నెల నెల కొద్దిగా డబ్బులు పంపించేవారని తెలుస్తుంది. గతంలో తారక రత్న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ .. జూనియర్ ఎన్టీఆర్ కి నాకు మధ్య మంచి అనుబంధం ఉందని, మేమిద్దరం బ్రదర్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటామని చెప్పుకొచ్చారు.

Jr NTR help to Taraka Ratna in that matter
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తారకరత్న కష్టాల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా నెలకు నాలుగు లక్షల రూపాయలు తనకు పంపించేవాడని తారకరత్న స్వయంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా ఎన్టీఆర్ సపోర్ట్ బాగా ఉండేదని ఆయన తెలిపారు. ఏది ఏమైనా తారకరత్న చిన్న వయసులోనే మరణించడం అందరికీ బాధాకరం. కుప్పం పాదయాత్రకు తారకరత్న వెళ్లకుండా ఉన్న బాగుండేది అనిపిస్తుంది. ఏదో ఇలా అనుకోవటమే కానీ విధి ఆడే నాటకంలో ఎవరు, ఎప్పుడు, ఎలా మరణిస్తారో చెప్పలేం.