Kajal Agarwal : ఆ హీరోతో ఆ పని చేయడం ఇష్టమట.. కాజల్ కోరికలు మామూలుగా లేవు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kajal Agarwal : ఆ హీరోతో ఆ పని చేయడం ఇష్టమట.. కాజల్ కోరికలు మామూలుగా లేవు

Kajal Agarwal : కాజల్ అగర్వాల్ సందడి ప్రస్తుతం కాస్త తగ్గింది. కాజల్ ఒకప్పుడు నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు కాజల్ మాత్రం తన పర్సనల్ లైఫ్‌కు మాత్రమే ఎక్కువగా టైం ఇస్తోన్నట్టు కనిపిస్తోంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్.. వెంటనే తల్లైంది. ఇక ఆమె అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. అలా ఆచార్య, ది ఘోస్ట్ సినిమాల నుంచి తప్పుకుంది. అందులో ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో కాజల్ ఖాతాలో ఓ […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 September 2022,8:00 am

Kajal Agarwal : కాజల్ అగర్వాల్ సందడి ప్రస్తుతం కాస్త తగ్గింది. కాజల్ ఒకప్పుడు నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు కాజల్ మాత్రం తన పర్సనల్ లైఫ్‌కు మాత్రమే ఎక్కువగా టైం ఇస్తోన్నట్టు కనిపిస్తోంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్.. వెంటనే తల్లైంది. ఇక ఆమె అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. అలా ఆచార్య, ది ఘోస్ట్ సినిమాల నుంచి తప్పుకుంది. అందులో ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో కాజల్ ఖాతాలో ఓ ఫ్లాప్ మిస్ అయినట్టైంది. ఇక కాజల్ తన భర్త కిచ్లూ వ్యాపారాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది.

ఇద్దరూ కలిసి వెంచర్లు చేస్తోన్నట్టుంది. మొత్తానికి కాజల్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా సంపాదించే పనిలో పడింది. సోషల్ మీడియాలో యాడ్స్, బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ సంపాదించేస్తోంది. తాజాగా అలానే ఓ యాడ్ కోసం కాజల్ నటించేసింది. ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. ఇందులో భాగంగా రాపిడ్ ఫైర్ సెషన్‌ను ఎదుర్కొంది కాజల్. కట్ చాయ్ ఇష్టమా? ఫిల్టర్ కాఫీ ఇష్టమా? అని అడిగారు. కట్ చాయ్ ఇష్టమని చెప్పేసింది. సల్మాన్ ఖాన్‌తో అడ్వెంచర్లు చేస్తావా? షారుఖ్ ఖాన్‌తో రొమాంటిక్ డేట్‌కు వెళ్తావా? అని అడిగితే.. తెలివిగా సల్మాన్ ఖాన్‌తో అడ్వెంచర్లు చేస్తాను అని చెప్పేసింది.

Kajal Aggarwal About Adventure with Salman Khan

Kajal Aggarwal About Adventure with Salman Khan

అసలే కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌లోనూ మంచి డిమాండ్ ఉన్న నటి. కానీ ఇంత వరకు ఆమె ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. మళ్లీ ఒక వేళ నటించే అవకాశం వస్తే గనుక స్టార్ హీరోలతోనే చేసేట్టుగా కనిపిస్తోంది. కానీ తల్లైన కాజల్‌ను మళ్లీ ఇప్పుడు హీరోయిన్‌గా తీసుకుంటారా? మునుపటి క్రేజ్, డిమాండ్ ఉంటుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం కాజల్ చేతిలో అయితే ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదనిపిస్తోంది. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించేందుకు కాజల్ ఇంట్రెస్ట్‌గానే ఉన్నట్టుంది. అందుకే ఫిట్ నెస్‌ను మెయింటైన్ చేస్తోందని తెలుస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది