Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కి కొడుకు.. అమ్మడి ఆనందానికి హద్దులు లేవుగా..!
Kajal Aggarwal : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు కాజల్ అగర్వాల్ ప్రసవించినట్టు ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయాన్ని కాజల్ అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఇలా ఉండగా కాజల్ అగర్వాల్ జనవరిలో తన ప్రెగ్నెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లును వివాహమాడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా కాజల్ కొన్ని సినిమాల్లో నటిస్తూ వచ్చినా, కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది.ఆచార్య చిత్రంలోనూ కాజల్ పాత్ర చాలా తక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే కొన్ని నెలల క్రితం కాజల్ గర్భవతి అనే విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇటీవల తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేసింది ఈ బ్యూటీ.ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి కాజల్ మాతృత్వపు ఆనందాన్ని పొందుతూ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఈ క్రమంలో నేడు ఉదయం 7గం.లకు కాజల్ మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం.అయితే ఈ విషయంపై కాజల్ అగర్వాల్, ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఇంకా స్పందించలేదు. కాగా ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు కాజల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు.

kajal aggarwal blessed with baby boy
Kajal Aggarwal : గుడ్ న్యూస్ చెప్పిన మిత్రవింద..
ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ సంబరపడిపోయారు. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ సరసన నటించడమే కాకుండా ఆటపాటల్లో సరైన జోడుగా మెప్పించింది. దాంతో ఈ కాంబో రిపీట్ అవుతుందని తెలిసి హ్యాపీ అయ్యారు.ఆచార్య సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి రెస్సాన్‌ను సొంతం చేసుకొన్నది. కాజల్ కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పూజా హెగ్డే కాస్తో కూస్తో ట్రైలర్ కనిపించింది. అయితే కాజల్ కనిపించకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే కాజల్ రోల్‌పై రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో కనిపించాయి.