Kajal Aggarwal : ఆచార్య ట్రైలర్‌లో కనిపించని కాజల్ అగర్వాల్.. పూర్తిగా పక్కన పెట్టారా.!
Kajal Aggarwal: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. దేవాదాయ భూముల ఆక్రమణలపై నక్సలైట్లు చేసే ఉద్యమం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది కాస్తా చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో టాకీ పార్టును మొత్తాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధం చేసేశారు. ఏప్రిల్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాజల్‌కి నిరాశేనా…నిన్న ట్రైలర్ విడుదల చేయగా, ఇందులో వింటేజ్ మెగాస్టార్ స్పష్టంగా కనిపిస్తున్నారు. కూర్చులో కూర్చుని సోనూ సూద్ కి వార్నింగ్ ఇస్తున్న సన్నివేశం అయితే ట్రైలర్ లో అదుర్స్ అనే చెప్పాలి. ట్రైలర్ లో మరో హైలైట్ మెగా పవర్ స్టార్ రాంచరణ్. ఇద్దరూ కామ్రేడ్ పాత్రల్లో కొదమ సింహాల్లా రెచ్చిపోయారు. ఆరంభంలో రాంచరణ్, ఆ తర్వాత చిరంజీవి.. చివర్లో తండ్రి కొడుకుల విధ్వంసం అన్నట్లుగా ఆచార్య ట్రైలర్ సాగింది. కొరటాల శివ చిరంజీవి కోసం సిద్ధం చేసిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
‘నేను వచ్చానని చెప్పాలనుకున్నా.. చేయడం మొదలు పెడితే’ అంటూ చిరంజీవి చెబుతున్న డైలాగ్ అద్భుతంగా ఉంది. ప్రతి షాట్ లో చిరు తన బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టేస్తున్నారు. చివర్లో చిరంజీవి కామ్రేడ్ అనగానే రాంచరణ్ ఎంట్రీ అదిరిపోతుంది. అయితే పూజా హెగ్డేని చూపించిన మేకర్స్ కనీసం ఒక్క ఫ్రేములో కూడా కాజల్ అగర్వాల్‌ని చూపించలేదు. అంటే ఆమె పాత్ర సినిమాలో పెద్దగా ఉండదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ట్రైలర్‌లో కాజల్ కనిపించకపోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇకక ట్రైలర్‌కి మణిశర్మ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కథలోలీనం అయ్యేలా మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.