Surya : సూర్యకు ఇంత ఘోర అవమానమా..? అతని తీసేసి ప్రభాస్ ని పెడుతున్నారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Surya : సూర్యకు ఇంత ఘోర అవమానమా..? అతని తీసేసి ప్రభాస్ ని పెడుతున్నారా..?

 Authored By ramu | The Telugu News | Updated on :26 November 2024,6:02 pm

ప్రధానాంశాలు:

  •  Surya : సూర్యకు ఇంత ఘోర అవమానమా..? అతని తీసేసి ప్రభాస్ ని పెడుతున్నారా..?

Surya : కోలీవుడ్ స్టార్ సూర్యకు కంగువ ఇచ్చిన షాక్ గురించి అందరికీ తెలిసిందే. శివ డైరెక్షన్లో 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కంగువ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో విఫలమైంది. ఈ సినిమా కోసం సూర్య ఎంత కష్టపడినా సరే వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈ సినిమా ఇచ్చిన షాక్ తో సూర్య చేయాల్సిన ఒక సినిమా చేజారిపోయిందని తెలుస్తుంది. కోలీవుడ్ నుంచి కంగువ బాహుబలి రేంజ్ సినిమా అవుతుందని ఊహించగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యాక నాలుగు రోజులు తర్వాత లెంగ్త్ తగ్గించినా కూడా లాభం లేకుండాపోయింది. సూర్య కు కంగువ సినిమా భారీ ఇంపాక్ట్ కలిగించిందని చెప్పొచ్చు. ఐతె ఈ సినిమా ఎఫెక్ట్ తో ఆయన చేయాల్సిన సినిమా కూడా మిస్ అయినట్టు తెలుస్తుంది. సూర్య తో బాలీవుడ్ మేకర్స్ కర్ణ అనే సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కంగువ ఘోర పరాజయ పాలైన కారణంగా ఆ సినిమా నుంచి సూర్యను తీసి ఆ ప్లేస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట…

Surya సూర్యకు ఇంత ఘోర అవమానమా అతని తీసేసి ప్రభాస్ ని పెడుతున్నారా

Surya : సూర్యకు ఇంత ఘోర అవమానమా..? అతని తీసేసి ప్రభాస్ ని పెడుతున్నారా..?

Surya సౌత్ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా సూర్య..

సూర్య ప్లేస్ లో ప్రభాస్ అంటే.. ఇది నిజంగానే దారుణమైన డౌన్ ఫాల్ అని చెప్పొచ్చు. సౌత్ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా సూర్య తన సత్తా చాటుతూ వచ్చాడు. కానీ ఎందుకో సూర్య ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలు అందుకోలేదు. కొన్ని సినిమాలు సామాజిక స్ప్రుహ కోసం చేసినా సరే అవి అవార్డులు తెచ్చిపెట్టాయి కానీ తన రేంజ్ పెంచలేదు.

కంగువ సినిమా సూర్యకు పాన్ ఇండియా లెవెల్ లో మాస్ హిట్ ఇస్తుందని భావించారు. కానీ సినిమా ఎక్కడ కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు. అందుకే సినిమా భారీ లాసులు తెచ్చింది. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. సూర్య తిరిగి ఫాం లోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. Kanguva Effect Prabhas Replaced Surya , Surya, Prabhas, Kanguva, Siva, Rebal Star, Kollywood

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది