Kannappa Movie : షాక్‌లో కన్నప్ప టీం.. హార్డ్ డిస్క్ ఎవరు తీసుకెళ్లారు..!
ప్రధానాంశాలు:
Kannappa Movie : షాక్‌లో కన్నప్ప టీం.. హార్డ్ డిస్క్ ఎవరు తీసుకెళ్లారు..!
Kannappa Movie : గత కొన్నాళ్లుగా కన్నప్ప రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మంచు విష్ణు. ఆయన నటించిన తాజా చిత్రం కన్నప్ప. భక్త కన్నప్ప జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప వచ్చిన దశాబ్ధాల తర్వాత అదే ఇతివృత్తంతో వస్తున్న సినిమా కావడంతో కన్నప్పపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రకటన నుంచే ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది. బడ్జెట్, క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు మోహన్ బాబు.

Kannappa Movie : షాక్‌లో కన్నప్ప టీం.. హార్డ్ డిస్క్ ఎవరు తీసుకెళ్లారు..!
Kannappa Movie అదృశ్య శక్తులు..
త్వరలో కన్నప్పను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా చిత్ర యూనిట్ ఊహించని సమస్యల్లో ఇరుక్కుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప చిత్రాన్ని రీమేక్ చేస్తూ అదే ఇతి వృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమాపై మంచు ఫ్యామిలీ భారీ అంచనాలే పెట్టుకుంది.
చిత్ర ప్రమోషన్, చిత్రీకరణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ కాంప్రమైస్ కాకుండా మంచు మోహన్ బాబు కన్నప్పను తెరకెక్కిస్తున్నారు. అయితే కన్నప్ప చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచు విష్ణుకు కష్టాలు వెంటాడుతున్నాయి. అదృశ్య శక్తుల ప్రోద్బలంతో హార్డ్ డ్రైవ్ మాయం అయిందంటూ ఎగ్గిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చరిత అనే యువతితో పాటు మరో వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.