Karthika Deepam 05 August 2022 Episode : శోభ చెంప పగలగొట్టిన సౌందర్య.. ఎలాగైనా శోభ, నిరుపముల పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్న స్వప్న..
Karthika Deepam 05 August 2022 Episode : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది 5 శుక్రవారం ఎపిసోడ్ 1423 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమకు గట్టి వార్నింగ్ ఇచ్చిన సౌందర్య. ఈవెంట్ వాళ్లుని పిలిచి హిమ, నిరుపం ల పెళ్లి గురించి అన్ని బాధ్యతలు అప్పజెప్తుంది. ఇదంతా చూసి సౌర్య బాధపడుతుంటుంది. కట్ చేస్తే స్వప్న నిరూపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శోభ వచ్చి ఆంటీ ఒక బ్యాడ్ న్యూస్ అక్కడ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి అని అంటుంది. ఆ పెళ్లి జరగకుండా నేను ఏదో ఒకటి చేస్తాను అని శోభా కి చెప్తుంది. ఇంతలో అక్కడికి ప్రేమ్, వాళ్ళ నాన్న ఇద్దరు వస్తారు. అప్పుడు శోభ డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఆంటీ ఏమి తినట్లేదు ప్రేమ్.. నిరుపం పెళ్లి అక్కడ జరిగిపోతుందని బాధపడుతున్నారు. అని అంటుంది. అప్పుడు ప్రేమ్, సత్యం, మేమందరం ఎలాగైనా తనని మారుస్తాము. నువ్వు ఏదో ఒకటి తిను అని చెప్తారు. సత్యం నిర్పం దగ్గరికి వచ్చి. పద ఇంటికెళ్దాం మీ అమ్మ నీకోసం భోజనం మానేసింది.
నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది. పదా వెళ్దాం అని అంటాడు. అప్పుడు నిరూపం ఏంటి డాడీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. అమ్మ మొండిది నన్ను ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది. నువ్వు అర్థం చేసుకో డాడీ. అమ్మ గురించి మీకు తెలుసు కదా.. నేను అక్కడికి వస్తే ఏదో ఒకటి చేసి శోభ మెడలో తాళి కట్టిస్తుంది. అందుకే నేను రాను అని అంటాడు. ఇంతలో సౌందర్యం చూడండి… నా మనవడు పెళ్లి నా మనవరాలు తోనే జరిగితీరుతుంది. తను ఇక్కడే ఉంటాడు. పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దని స్వప్నకి మీరు చెప్పండి. ఇక వెళ్లండి అని అంటుంది. సత్యం అక్కడినుంచి వెళ్ళిపోతాడు. నిరుపం నువ్వు ఇలాగే స్ట్రాంగ్ గా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను అని అంటుంది సౌందర్య. కట్ చేస్తే సత్యం, స్వప్నను మనుషుల మీద కోపం భోజనం మీద చూపించవద్దు ఏదో ఒకటి తిను స్వప్న అని అంటాడు. అప్పుడు స్వప్న నిర్పం ఏమన్నాడు వస్తానన్నాడా అని అడుగుతుంది. నిరుపం మన మాట వినేటట్లు లేడు పూర్తిగా వాళ్ళవైపే తిరిగాడు.
చూడమ్మా మీ పెళ్లి జరగడం ఆసంభవం అని శోభతో అంటాడు. అప్పుడు స్వప్న మీరు ఏం చేయలేరు అది నాకు తెలుస్తుంది. శోభ పెళ్లి నేను జరిపిస్తాను ఏది ఏం జరిగినా కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరు పెళ్లి నేను చేస్తాను. అని అంటుంది స్వప్న. కట్ చేస్తే నిరూపంకు, శౌర్య తన జీవితం అంతా కష్టాలతోనే సాగిపోతుంది బావ. తన జీవితంలో కోరుకున్నది నిన్ను ఒక్కడినే, బావ. తన కోరుకున్న జీవితాన్ని ఇవ్వొచ్చు కదా బావ. అని అంటుంది హిమ.అప్పుడు మరి నేను కోరుకున్న జీవితం నాకు కావాలి కదా.. ఇక ఈ విషయాన్ని మర్చిపోమని అక్కడినుంచి వెళ్ళిపోతాడు నిరుపం. కట్ చేస్తే సౌందర్య, ఆనందరావు పెళ్లి గురించి డెకరేషన్ గురించి ఈవెంట్స్ వాళ్లకు చెప్తూ ఉంటారు. నిరూపం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు సౌందర్య, హిమ నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏదో ఒక విధంగా శోభతో నీ పెళ్లి జరిగేలా చేస్తుంది. మీ అమ్మ అని అంటారు. నిర్పం వెళ్లకుండా ఆపుతారు.
స్వప్న భోజనం సంగతి నాకు వదిలి నేను చూసుకుంటాను అని అంటుంది సౌందర్య. ఇదంతా సౌర్య చూస్తూ హిమ పెళ్లి కోసం వీళ్ళందరూ ఎంత తపన పడిపోతున్నారు. నేను ఇక్కడ ఉండడం అవసరమా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే సత్యం భోజనం చేస్తూ ఉండగా.. శోభ అక్కడికి వచ్చి ఆంటీ అక్కడ తినకుండా బాధపడుతుంటే మీరేమో హ్యాపీగా తింటున్నారా అని అంటుండగా.. అక్కడికి సౌందర్య వచ్చి తన చెంప పగలగొడుతుంది. అప్పుడు ఏంటి నన్ను కొడుతున్నారు మీరు అని అడగగానే.. ఈ ఇంట్లో నీ బోడి పెత్తనం ఏంటే అని అంటుండగా స్వప్న వస్తుంది. ఏంటి నా కోడల్ని కొడుతున్నారు అని అంటుంది. ఇది నీ కోడల నువ్వు అనుకుంటే సరిపోతుందా. నీ కోడలు నా మనవరాలు ఇది ఫిక్స్ అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే…