Karthika Deepam 17 Nov Today Episode : బస్తీకి వెళ్లిపోవడానికి దీప రెడీ.. చివరిసారిగా కార్తీక్ తో మాట్లాడి.. దీప నిర్ణయం విని కార్తీక్ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 17 Nov Today Episode : బస్తీకి వెళ్లిపోవడానికి దీప రెడీ.. చివరిసారిగా కార్తీక్ తో మాట్లాడి.. దీప నిర్ణయం విని కార్తీక్ షాక్

 Authored By gatla | The Telugu News | Updated on :17 November 2021,9:20 am

Karthika Deepam 17 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 నవంబర్, 2021 బుధవారం 1199 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి.. వదిన చూసిందా అని ఆదిత్య షాక్ అవుతాడు. అవును.. తనొచ్చి చూసిందనే నా టెన్షన్. తను ఏం అర్థం చేసుకుందో.. అపార్థం చేసుకుందో తెలియదు. మాట్లాడుదామంటే నాకు నోరు రావట్లేదు. తనమో నోరు విప్పి అడగదు. నరక యాతన అనుభవిస్తున్నానురా. పగవాడికి కూడా ఇటువంటి పరిస్థితి రావద్దు. నువ్వు అడిగినట్టు.. నన్ను కూడా కాలర్ పట్టుకొని అడిగితే జరిగిందంతా చెప్పేవాడిని. కానీ.. తను ఏం మాట్లాడట్లేదు.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు కార్తీక్.

karthika deepam 17 november 2021 full episode

karthika deepam 17 november 2021 full episode

నేనేమీ తెలిసి తెలిసి తప్పు చేయలేదురా. మోనిత చెప్పేదంతా అబద్ధం అని నిరూపించుకుంటాను కానీ.. దీప పరిస్థితే అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏం చేస్తుందో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాను. అరేయ్.. నువ్వు ఒక పని చేయ్ రా. మోనితను కలిసిన విషయం అస్సలు దీపకు చెప్పకు. నేను దీపతో ఎలాగోలా మాట్లాడుతా. నువ్వు మాత్రం ఈ టాపిక్ దీప దగ్గర తీసుకురాకు. నీ ఆవేశాన్ని నాకోసం అదుపులో పెట్టుకురా ప్లీజ్ అంటాడు కార్తీక్.

కట్ చేస్తే.. మోనిత రెడీ అయి కూర్చుంటుంది. ఆదిత్య ఆవేశపరుడు. కార్తీక్ ఎంత శాంతంగా ఉంటాడో.. ఆదిత్య అంత ఆవేశంగా ఉంటాడు.. అని అనుకుంటుంది. ఇంతలో ప్రియమణిని పిలిచి.. ఒక చిన్న చెరువు ఉంది అనుకో.. ఆ చెరువులో పెద్ద బండ విసిరేస్తే ఏమౌతుంది అని అడుగుతుంది. పెద్ద చప్పుడు వస్తుంది.. నీళ్లన్నీ అల్లకల్లోలం అవుతాయి అంటుంది.

కదా.. ఇప్పుడు మా అత్తగారింట్లో అదే పని జరుగుతుంది కావచ్చు. నేను చెప్పిన మ్యాటర్ ను అడుగుతూ ఇంట్లో వాళ్లను నిలదీస్తూ ఉంటాడు. ఈ పాటికి ఇంట్లో వాళ్లను కడిగేసి ఉంటాడు. మోనిత గురించి వాళ్లలో మరోసారి భయం ప్రారంభం అవుతుంది అంటుంది మోనిత.

Karthika Deepam 17 Nov Today Episode : దీపతో నిజం చెబుతా అని సౌందర్యతో అన్న కార్తీక్

దీపతో నిజం చెబుతాను మమ్మీ అని కార్తీక్ సౌందర్యతో అంటాడు. దీంతో ఏం చెబుతావు. నిజం తెలిసి తను ఇంటి నుంచి వెళ్లిపోతా అంటే ఏం చేస్తావు అంటుంది. ఒరేయ్ పెద్దోడా.. దీప మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు నువ్వు తొందరపడకు. ఇప్పటికే దాన్ని 11 ఏళ్లు ఈ ఇంటికి దూరం చేశావు. శాశ్వతంగా దూరం చేసే తప్పు చేయకు.. అంటుంది.

మరోవైపు ఆదిత్య డల్ గా ఉంటాడు. ఏమైంది అని అడుగుతుంది శౌర్య. ఇంట్లో పండగ వాతావరణమే లేదు. ఎవరూ ఎవరితో మాట్లాడటం లేదు.. అంటూ బాధపడతాడు. దీంతో ఎటైనా బయటికి వెళ్దామా అంటుంది శ్రావ్య. వద్దు అంటాడు. మోనిత విషయం శ్రావ్యకు చెప్పాలా? వద్దా? అని కన్ఫ్యూజ్ అవుతాడు ఆదిత్య.

మరోవైపు దీప.. కిచెన్ లో అప్పలు చేస్తుంటుంది. అప్పలు చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సౌందర్య చూస్తుంది. ఈ సమయంలో వంట గదిలో ఏం చేస్తుందని సౌందర్య షాక్ అవుతుంది. అక్కడికి వెళ్లి దీప.. ఏం చేస్తున్నావే అంటుంది. పండగ కదా అత్తయ్య పిల్లల కోసం అప్పలు చేస్తున్నాను అంటుంది.

ఎందుకు ఈ పనులు చెప్పు.. బయటి నుంచి తెప్పించుకోవచ్చు కదా అంటే.. అన్నింటికి బయటివే కావాలా అత్తయ్య అంటుంది. ఏమంటున్నావే అంటే.. పిల్లలకు నా చేతులతో చేసి పెడతే మంచిది కదా అత్తయ్య. నేను వంటలక్కను అని అప్పుడప్పుడు మరిచిపోతుంటే.. కొందరు గుర్తు చేస్తుంటారు అంటుంది.

మీరు మారిపోయారు అత్తయ్య అంటూ దీప అంటుంది. మునుపటిలా లేరు అంటుంది. మరి నేనెలా కనిపిస్తున్నాను అత్తయ్య. కోడలుగా బోర్ కొట్టేశానా అని అడుగుతుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటుంది సౌందర్య. మరి రెండో కోడలు మాటేమిటి అంటుంది సౌందర్య. శ్రావ్య అత్తయ్య అంటుంది దీప. మీరిద్దరూ రెండు కళ్ల లాంటి వారు అంటే.. మూడో కోడలు వస్తే మూడో కన్ను అవసరం ఉండేది అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది