Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబు, వంటలక్క సంపాదించుకున్నది ఎంతో తెలుసా..??
Karthika Deepam : 2017 సంవత్సరంలో ప్రారంభం అయిన కార్తీక దీపం సీరియల్ సుదీర్ఘ కాలం పాటు నెం.1 సీరియల్ గా కొనసాగింది. ఒకానొక సమయంలో ఇండియన్ టాప్ రేటింగ్ దక్కించుకున్న సీరియల్ గా కూడా కార్తీక దీపం రికార్డు సొంతం చేసుకుంది. అలాంటి కార్తీక దీపం సీరియల్ ముగింపు దశకు వచ్చేసింది అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించిన సమయంలో ప్రేక్షకులు అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సీరియల్ ను ఏదో విధంగా పొడగిస్తూ ఉంటారని అంతా భావించారు. కానీ ఇంకా సీరియల్ ను పొడగించడం సాధ్యం కావడం లేదని మేకర్స్ ప్రకటించారు.
ఇక కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు అలియాస్ డాక్టర్ కార్తీక్ పాత్రను పోషించిన నిరుపమ్ మరియు వంటలక్క అలియాస్ దీప పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాథ్ లు ఎంత సంపాదించారు అంటే చాలా మంది వద్ద సమాధానం ఉండదు. కానీ వారిద్దరు కార్తీక దీపం సీరియల్ తో సంపాదించింది ఒక హీరో హీరోయిన్ సంపాదించిన మొత్తానికి సమానం అంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీలో కార్తీక దీపం సీరియల్ యొక్క స్టార్స్ కి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి స్టార్స్ రేంజ్ లో గుర్తింపు దక్కింది. కోట్ల రూపాయలను వారు సంపాదించుకున్నారా
అంటే ఔను అనే సమాధానం రావడంతో పాటు అంతకు మించిన లక్షలాది మంది అభిమానంను వారిద్దరు సొంతం చేసుకున్నారు అనేది చాలా మంది మాట. బుల్లి తెర ఇండస్ట్రీ లో కార్తీక్ మరియు దీప లకు ఉన్న క్రేజ్ ఎంతో అందరికి తెల్సిందే. వారిద్దరు కూడా ఇప్పుడు సినిమాల్లో నటిస్తే రోజుకు అయిదు నుండి ఏడు లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. అలాంటి క్రేజ్ ను వీరు దక్కించుకున్నారు. ఇంతకంటే ఏం సంపాదన కావాలి చెప్పండి. ముందు ముందు వీరు కలిసి నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.