Karthika Deepam Serial : కార్తీక దీపం పిల్లల యొక్క రెమ్యూనరేషన్‌ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam Serial : కార్తీక దీపం పిల్లల యొక్క రెమ్యూనరేషన్‌ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

 Authored By prabhas | The Telugu News | Updated on :26 January 2023,9:40 am

Karthika Deepam Serial ; తెలుగు సీరియల్ అనగానే గుర్తుకు వచ్చే పేరు కార్తీక దీపం. ఈ సీరియల్ లో డాక్టర్ బాబుగా కనిపించిన నిరూపమ్‌ మరియు వంటలక్కగా కనిపించిన ప్రేమి హీరో హీరోయిన్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు అనే విషయం తెలిసిందే. ఇక వారికి కూతుర్లుగా కనిపించిన హిమా మరియు శౌర్యలు కూడా సినిమాల ద్వారా దక్కించుకునే గుర్తింపు కంటే ఎక్కువగానే సొంతం చేసుకున్నారు. వారి అసలు పేర్లతో కంటే కూడా హిమా మరియు శౌర్య పేర్లతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ హిమా మరియు శౌర్య అనే పేరుతోనే చర్చలో ఉంటారు.

వీరిద్దరూ చిన్న వయసు నుండి సీరియల్ లో నటించడం మొదలు పెట్టారు.అప్పటి నుండి ఇప్పటి వరకు వీరికి దక్కిన రెమ్యూనరేషన్ పరిశీలిస్తే.. ఒక యంగ్ హీరోకి దక్కినంత రెమ్యూనరేషన్ దక్కింది అంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. డాక్టర్ బాబు మరియు వంటలక్క పాత్రల తర్వాత అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న పాత్రలుగా వీరిద్దరి పాత్రలు నిలుస్తాయి. సీరియల్ లో వీరిద్దరి యొక్క పాత్రలు అద్భుతంగా ఉండడం వల్లే సూపర్ హిట్ అయింది అనడంలో సందేహం లేదు. అందుకే వారికి సీరియల్ మేకర్స్ సముచిత న్యాయం కలిగించేలా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు అనేది టాక్.

Karthika Deepam Serial Sourya and Hima remuneration

Karthika Deepam Serial Sourya and Hima remuneration

సీరియల్ తో ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్న వారిద్దరూ ఇప్పుడు ఇతర సీరియల్స్ లో బిజీ అవ్వబోతున్నారు. ఇటీవలే కార్తీకదీపం సీరియల్ ముగియబోతోందని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. దాంతో వీరిద్దరి కొత్త సీరియల్ ఏంటి.. ఎప్పుడు మొదలవుతాయి అనేది అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య కార్తిక దీపం సీరియల్ వీరిద్దరు లేకుండా కొన్ని వారాల పాటు కొనసాగింది. అప్పుడు రేటింగ్ దారుణంగా పడి పోయింది. అందుకే మళ్ళీ తీసుకొచ్చారు. వారిద్దరు లేకుంటే సీరియల్ రేటింగ్ ఉండదని అందరికీ అర్థమైంది. అందుకే వారు పెద్దవారు అవ్వడంతో సీరియల్ కొనసాగే అవకాశం లేదని మేకర్స్ సీరియల్ ని ఆపేస్తున్నారట. ఈ కారణం వల్ల వారికి భారీ పారితోషం ఇచ్చారు అనడంలో సందేహం లేదు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది