Katrina Kaif : కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా.. వీడియో చూస్తే నిజమనిపిస్తుంది..!
Katrina Kaif :బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ కొద్ది రోజుల క్రితం తన ప్రియుడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ గత ఏడాది డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లో బాలీవుడ్ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వివాహం జరిగి ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు. నూతన వధూవరులు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. విరామం దొరికితే చాలు విహారాలకు చెక్కేస్తున్నారు. రీసెంట్‌గా కత్రినా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఎప్పటిలాగానే ఆమె ఫోటోలు, వీడియోలు ఫోటోగ్రాఫర్లు రికార్డు చేశారు.
చుడిదార్ ధరించి ఉన్న కత్రినా కైఫ్ బెల్లి కొంచెం పెద్దగా కనిపించింది.కత్రినా నడక తీరు కూడా వేరేలా ఉంది. దాంతో కత్రీనా ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఓహ్ మై గాడ్.. కత్రీనా ప్రెగ్నెంట్‌లా ఉంది?’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘త్వరలో కాట్ తల్లి కాబోతుంది. కత్రీనా పాపను చూడాలని ఆతృతగా ఉంది’ అని ఇంకొకరు ట్వీట్ చేసారు. కాట్ నిజంగానే తల్లికాబోతుందా? లేదా డ్రెస్ వల్ల అలా కనిపిస్తోందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. దీనిపై అందరిలో పలు అనుమానాలు ఉన్నాయి.
Katrina Kaif : కత్రినా బేబి బంప్..
ఈ వార్తలపై కత్రినా లేదా విక్కీ కౌశల్ స్పందిస్తే మినహా క్లారిటీ రాదు. ఈ మధ్య పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వరుసగా తల్లుల అవుతున్నారు. కాజల్ అగర్వాల్, ప్రణీత శుభాష్ గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కత్రినా జోరు తగ్గింది. ఆమె స్టార్ హీరో హోదా నుండి తప్పుకున్నట్లే లెక్క. ప్రస్తుతం ఆమె మూడు హిందీ చిత్రాలు చేస్తున్నారు. ఫోన్ బూత్ చిత్రంతో పాటు మెర్రి క్రిస్మస్, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తున్నారు. కత్రినా పెళ్లయ్యాక కూడా తెగ అందాలు ఆరబోస్తుంది. ఆ మధ్య విహార యాత్రకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో నానా రచ్చ చేసింది.
View this post on Instagram