Khiladi : అంద‌రి స‌మ‌క్షంలో హీరోయిన్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన స్టార్ డైరెక్ట‌ర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Khiladi : అంద‌రి స‌మ‌క్షంలో హీరోయిన్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన స్టార్ డైరెక్ట‌ర్

 Authored By sandeep | The Telugu News | Updated on :10 February 2022,10:00 pm

Khiladi :మ‌రి కొద్ది రోజుల‌లో స్టార్ హీరోల సినిమాలు థియేట‌ర్‌లో తెగ సంద‌డి చేయ‌నున్నాయ‌. మాస్‌ హహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖిలాడి’. ‘క్రాక్‌’ వంటి సూపర్ హిట్‌ తర్వాత రవితేజ నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 11న (శుక్రవారం) విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ పెంచే పనిలో పడ్డ చిత్ర యూనిట్‌ బుధవారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాల్గొంది. అయితే ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్‌ వర్మ స్టేజ్‌పై అందరి సమక్షంలోనే హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి క్షమాపణాలు చెప్పారు.

ఖిలాడీ ట్రైలర్‌ సహా ఇతర ప్రమోషన్స్‌లోనూ డింపుల్‌ హాయాతినే ఎందుకో కాస్త ఎక్కువగా చూపించారు. ఈ విషయంలో ఐయామ్‌ ఎక్స్‌ట్రీమ్లీ సారీ.. సినిమా చూశాక నువ్వు సంతోషిస్తావు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధన్యత ఉంటుంది అంటూ పేర్కొన్నారు. రమేశ్ వర్మ మాటలకు కన్విన్స్‌ అయిన మీనాక్షి చిరునవ్వుతోనే సరే అన్నట్లుగా సమాధానం చెప్పింది. మరి ఈ వీకెండ్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతోన్న మాస్‌ మహారాజ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తాడో చూడాలి.రీసెంట్‌గా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘నేను జాతకాన్ని, అదృష్టాన్ని పెద్దగా నమ్మను. వందశాతం కష్టాన్నే నమ్ముతాను.

khiladi director says sorry to heroine

khiladi director says sorry to heroine

అయితే ఒకటి లేదా రెండు శాతం నాకు లక్‌ ఉండి ఉంటుంది.. ఆ మాత్రం లక్‌ కూడా లేకపోతే ఇక్కడి వరకు రాలేను. రమేష్‌ వర్మకి జాతకం, అదృష్టం శాతాలను పెంచాలనిపిస్తోంది. ఆ జాతకానికి, అదృష్టానికి ఓ పేరు ఉంటే కోనేరు సత్యానారాయణగారు. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మీనాక్షి, డింపుల్‌ హయతి భవిష్యత్‌లో స్టార్‌ హీరోయిన్స్‌ అవుతారనే నమ్మకం ఉంది. నేను ‘ఖిలాడీ’ ఒప్పుకోవడానికి ఒక కారణం రచయిత శ్రీకాంత్‌ విస్సా, మరోకారణం సత్యనారాయణగారు. ఈ సినిమాలో నేను బాగున్నాను అంటే ఆ క్రెడిట్‌ జీకే విష్ణుగారికి వెళ్తుంది’’ అన్నారు

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది