Rashmika Mandanna : కిచ్చా సుదీప్ చురకలు రష్మిక మందన్న కేనా.!? పర్ఫెక్ట్ కౌంటర్.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : కిచ్చా సుదీప్ చురకలు రష్మిక మందన్న కేనా.!? పర్ఫెక్ట్ కౌంటర్.!

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2023,5:00 pm

Rashmika Mandanna : ఇటీవల రష్మిక మందన్న కన్నడ ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టి పై చేసిన కామెంట్స్ దక్షిణాది సినిమాలోని పాటలను తక్కువ చేసి మాట్లాడడం తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తనదైన స్టైల్ లో స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేసిన విషయంపై సుదీప్ స్పందించాడు.

ఒకప్పుడు ఏ విషయమైనా టీవీలో చూస్తే మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలు ఎక్కువైపోయాయి. సోషల్ మీడియా ద్వారా ఒక్కోసారి తప్పుడు సమాచారం కూడా బయటకు వెళ్తుంది. వాటిని మనమే కంట్రోల్ చేయాలి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు పూలదండలే కాదు, గుడ్లు టమాటాలు రాళ్లు కూడా పడతాయి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి అని చెప్పాడు. దీంతో సుదీప్ పరోక్షంగా రష్మిక గురించి మాట్లాడాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. రష్మిక తన సినిమా

kiccha sudeep perfect counter to Rashmika Mandanna

kiccha sudeep perfect counter to Rashmika Mandanna

కెరియర్ను కన్నడ ఇండస్ట్రి నుంచి స్టార్ట్ చేసింది. కన్నడ నటుడు, దర్శకుడు రిశబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరాక్ పార్టీ సినిమాలో రష్మిక నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తుంది రష్మిక. అయితే రష్మిక గతంలో ఓ ఇంటర్వ్యూలో కాంతార సినిమా కన్నడ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. దీంతో రష్మీకి కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని ఫాన్స్ ఫైర్ అయ్యారు. అయితే ఇటీవల రష్మిక ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది