వామ్మో.. ట్విస్ట్‌లని మించిన ట్విస్ట్‌లు.. వణుకి పుట్టేస్తుంది అంతే..!
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల జాతర మాములుగా లేదు.. కేవలం తెలుగు సినిమాలకే కాదు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్… ఏ భాషలో వచ్చినా, కథ బాగుంటే చాలు, ప్రేక్షకులు వదిలిపెట్టడం లేదు. అందులోనూ థ్రిల్లర్ జానర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. మనల్ని కుర్చీలో ఉరుకునట్టు చేసే మలుపులు, ఉత్కంఠ భరితమైన కథలు, చివరిదాకా ఎమోషనల్‌గా కట్టిపడేసే ట్రీట్‌మెంట్ ఇవే థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో స్పెషల్ క్రేజ్
ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లోకి వచ్చిన సినిమా ఒకటి ప్రేక్షకులను సస్పెన్స్‌లోకి లాక్కెళ్తోంది. ఇది ఒక శక్తివంతమైన స్పై థ్రిల్లర్-కామెడీ డ్రామా. సీన్ ఒక్కొక్కటా టెన్షన్‌తో నిండిపోయి, ప్రతి మలుపూ షాక్ ఇచ్చేలా ఉంటుంది. ఓ సాదాసీదా మహిళ, భర్త, కొడుకుతో కలిసి సంతోషంగా జీవిస్తుండగా అసలు ఆమె గతం వేరే దిశలో తిరుగుతుంది. తన భార్య ఒకప్పటి రా (RAW) ఏజెంట్ అని ఆయనకి తెలియదు 13 సంవత్సరాలుగా గోప్యంగా జీవిస్తున్న ఆమె, దేశానికి సేవ చేయడం మానేసి కుటుంబానికి అంకితం అయింది.

వామ్మో.. ట్విస్ట్‌లని మించిన ట్విస్ట్‌లు.. వణుకి పుట్టేస్తుంది అంతే..!
కానీ ఒక దారుణమైన ఘటన ఆమెను మళ్లీ తిరిగి ఆటలోకి దిగేలా చేస్తుంది.ఒక మిస్టీరియస్ కిల్లర్ మహిళలను మాత్రమే టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తుంటాడు. అతని బాధితుల్లో ఇంటెలిజెన్స్ ఏజెంట్లు కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉన్నా, ఆమె మాత్రం ఊరుకోదు.ఆమె ఎలా తిరిగి స్పైగా మారింది?కామన్ మ్యాన్ పేరుతో చంపుతున్న ఆ కిల్లర్ ఎవరూ?ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సినిమాలోనే తెలుస్తుంది!