Lokesh Kanagaraj : అంతా తూచ్ మెగా ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కోలీవుడ్ డైరెక్టర్..
Lokesh Kanagaraj : మెగా ఫ్యాన్స్‌కు భారీ షాకిచ్చాడు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత ఆచార్య సినిమాతో వచ్చి ఊహించని విధంగా ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. కెరీర్‌లో కొరటాల శివ ఎప్పుడు చూడని భారీ ఫ్లాప్ ఆచార్య సినిమాతో చూశాడు. అయినా చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అయితే, ఇదే క్రమంలో చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను కమిటైయ్యాడు. కానీ, ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాను గౌతమ్ హ్యాండిల్ చేస్తాడో లేదో అని చరణ్ సందేహిస్తున్నాడట. అందుకే, పెద్ద దర్శకుడితో సినిమా చేయాలని, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దాంతో ఇటీవల విక్రమ్ సినిమాతో భారీ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపించింది.తీసింది నాలుగు సినిమాలే అయినా కూడా లోకేష్ ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా పాపులారిటీని తెచ్చుకున్నాడు.

Kollywood director Lokesh Kanagaraj bad news to mega fans
Lokesh Kanagaraj : మెగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ చేశాడు.
నాలుగు సినిమాలలో మూడు సినిమాలు భారీ కమర్షియల్ సక్సెస్ సాధించాయి. దాంతో లోకేష్‌తో చరణ్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై దర్శకుడు క్లారిటీ
మెగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ చేశాడు. నేను, చరణ్ కలుసుకున్నది నిజమే. కానీ, మాధ్య కథా చర్చలు మాత్రం జరగలేదు. చాలా క్యాజువల్‌గా కలిశాము. అంతే, సినిమా చేయడం లేదంటూ అసలు విషయం చెప్పి షాకిచ్చాడు. దాంతో చరణ్ లోకేష్‌తో సినిమా చేసి భారీ హిట్ అందుకుంటాడని భావిస్తున్న
ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు.