Coolie Movie Review : కూలీ మూవీ క్రిటిక్ రివ్యూ
Coolie Movie Review : ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’ ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. టాలీవుడ్ మంజులుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, బాలీవుడ్ స్టార్ పూజా హెగ్డే, అమీర్ ఖాన్, రెబ్బా మోనికా జాన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండగా, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్, బ్యాంకాక్ వంటి ప్రాంతాల్లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంది. సినిమాను అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మించగా, ఐమాక్స్ వెర్షన్‌లో కూడా థియేటర్లలో విడుదల చేస్తుండటం విశేషం. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 350 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.

Coolie Movie Review : కూలీ మూవీ క్రిటిక్ రివ్యూ
ఇక సినిమాకు సంబంధించిన ఓ ప్రైవేట్ స్క్రీనింగ్ జరగగా, దాన్ని చూసిన సినీ జర్నలిస్టు, క్రిటిక్, యాక్టర్ కుల్దీప్ గాధ్వీ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ‘కూలీ’ సినిమా టెర్రిఫిక్‌గా ఉందని, రజనీకాంత్ ఇప్పటి వరకు చేయని విధంగా నటించారని ప్రశంసించారు. అలాగే అమీర్ ఖాన్ కొత్త అవతారంలో అలరించాడని చెప్పారు. నాగార్జున, శృతిహాసన్, పూజా హెగ్డే, ఉపేంద్ర తమ పాత్రల్లో ఒదిగిపోయి అద్భుతంగా నటించారని తెలిపారు. అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఊపొచ్చేలా ఉందని, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మాస్ బ్లాక్‌బస్టర్ డెలివర్ చేశారని పేర్కొన్నారు. సినిమాకు ఆయన ఇచ్చిన రేటింగ్ 5/5 కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.