Kovai Sarala : 59 ఏళ్ల కోవై సరళ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? తన జీవితంలోని చీకటి కోణం ఏంటి? తనకు ఏం జరిగింది?
Kovai Sarala : తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య నటులకు కొదవ లేదు. అయితే.. హాస్యం పండించేంది ఎక్కువగా మగవాళ్లే ఉంటారు. హాస్య నటీమణులు అంటే చాలా అరుదు అనే చెప్పుకోవాలి. అప్పట్లో శ్రీలక్ష్మి తన దైన శైలిలో హాస్యం పండించేశారు. ఆ తర్వాత నేనున్నాను అంటూ కోవై సరళ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మగ హాస్య నటులతో పోటీపడి మరి నటించి హాస్యం పండించి తను ఎంతో గుర్తింపు పొందారు. కానీ.. తన సినీ జీవితాన్ని పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితంలో తను చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అసలు తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
59 ఏళ్లు వచ్చినా తను ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. వైవాహిక జీవితానికి దూరం అయి కుటుంబాన్ని పోషించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కాంచన సినిమాలో ఆమె చేసిన కామెడీని చూసి అందరూ నవ్వుకున్నార. తన డైలాగ్ లతో అందరినీ మెప్పించారు. నువ్వే కావాలి నుంచి ఇప్పటి వరకు దాదాపు 800 సినిమాల్లో కోవై సరళ నటించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక బ్రహ్మానందం, కోవై సరళ జంట అంటే వెండి తెరపై ఎంత కామెడీని పండించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె డైలాగ్ డెలివరీ మాత్రం ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తుంది. సినిమాల్లో సరళ పండించే హాస్యానికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తన నలుగురు చెల్లెళ్ల కోసమే ఆమె వివాహం చేసుకోకుండా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కోవై సరళ అందరు హీరోలతో కూడా నటించి శెభాష్ అనిపించుకున్నారు. వారి సినిమాల్లో హాస్యం పండిస్తూ ప్రేక్షకులను మన్ననలను కూడా అందుకున్నారు.
నలుగురు చెల్లెళ్ల ఆలనా పాలనా చూసుకోవడం కోసమే తను ఎక్కువగా సమయం కేటాయించేవారు. తన చెల్లెళ్ల కోసమే తన జీవితాన్ని కోవై సరళ అంకితం చేశారు. తెర మీద కనిపించే జీవితాల్లో, తెర వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. తెర మీద ఎంత నవ్వుకున్నా జీవితంలో మాత్రం బాధలే వారికి బంధువులు అవుతుంటాయి. అలా చిన్నతనంలో కూడా కోవై సరళ ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తన చెల్లెళ్లను పెంచడం కోసం చాలా కష్టపడ్డారు. చివరకు తనకు సినిమాల్లో నటించే అవకాశం రావడంతో తను ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి ఎంతో గుర్తింపు సాధించారు. కొందరు డైరెక్టర్లు, నిర్మాతలు అయితే కోవై సరళ డేట్స్ కోసం ఒకప్పుడు వేచి చూసేవారు. తన కోసం సినిమా షూటింగ్ ను కూడా వాయిదా వేసుకునేవారు.
అప్పట్లో మహిళా కమెడియన్ గా తనకు ఉన్న గుర్తింపు అలాంటిది. ఈ మధ్య కోవై సరళ ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు కానీ, అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ముని, కాంచన సినిమాల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. హార్రర్ తో కూడిన కామెడీని పండించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు కోవై సరళ. చాలా మంది నటులు కుటుంబం కోసమే తమ సర్వస్వాన్ని ధారపోస్తుంటారు. అలా కోవై సరళ కూడా తన సంతోషం కోసం కాకుండా.. తన కుటుంబం కోసమే ఎక్కువగా ఆలోచించేవారు. ఏ భాషలో నటించినా తనే సొంతంగా డబ్బింగ్ చెప్పేవారు కోవై సరళ. తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచేవారు కోవై సరళ. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తన నటనతో అందరినీ మెప్పించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కోవై సరళ ఇంకా ఎన్నో మంచి సినిమాల్లో హాస్యం పండించాలని మనసారా కోరుకుందాం.