Krithi shetty : నటన చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.. కృతి శెట్టి కామెంట్స్ వైరల్
Krithi shetty : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉప్పెన హాట్ టాపిక్ అవుతోంది. ఇంకో మూడు రోజుల్లో థియేటర్లోకి రాబోతోన్నందున్న ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేశారు. చిత్రయూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం, హీరో హీరోయిన్లు దర్శకుడు ఇంటర్వూలంటూ బిజీగా ఉన్నారు. అయితే ఈ ఇంటరాక్షన్‌లో మాట్లాడుతున్న హీరోయిన్ తాజాగా కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. తన నటనను చూసి అందరూ ఏడ్చేశారట.

Krithi shetty about Uppena Emotional Scene
Krithi shetty : కృతి శెట్టి కామెంట్స్ వైరల్..
సినిమాలో ఓ ఎమోషనల్ సన్నివేశం చిత్రీకరణ పూర్తయ్యాక మోనిటర్‌లో ఔట్‌పుట్ చెక్ చేస్తుంటే ఛాయాగ్రాహకుడు కన్నీళ్లు పెట్టుకున్నారని కృతి చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నటిగా చాలా గర్వంగా అనిపించిందని తెలిపింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని ఎమోషనల్ అయింది.. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవిగారు నా నటనను మెచ్చుకోవడం మరో గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాకు సంతకం చేయకముందు నాకు ఏ దర్శకులు, హీరోలూ తెలియదు. చిరంజీవిగారు మాత్రమే తెలుసు. సుకుమార్ గారిని కలిసినపుడు కొంత ధైర్యం వచ్చింది. నేను టీవీలో వచ్చే సినిమాలు చూడటం తప్ప, బయటకెళ్లి చూసింది లేదంటూ మెగా అభిమానుల మనసు దోచేసింది. మొత్తానికి కృతికి ఇప్పుడు డిమాండ్ మాత్రం మామూలుగా లేదు. ఇక సినిమా విడుదలై కృతికి మంచి పేరు వస్తే మాత్రం స్టార్ హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదు.