Krithi Shetty : యెల్లో గౌనులో కృతి శెట్టి హోయలు… ఫిదా అవుతున్న నెటిజన్లు
Krithi Shetty: వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి అందరికీ సుపరిచితమే. ఉప్పెన సినిమాతో ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తొలి సినిమాతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇక నానితో శ్యాంమ్ సింగారాయ్, నాగచైతన్య బంగార్రాజుతో హ్యాట్రిక్ అందుకుంది. ప్రస్తుత ఈ అమ్మడు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కృతి.
సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ పోతినేనికి జోడీగా ది వారియర్, నితిన్ సరసన మాచర్ల నియోజవర్గం సినిమాల్లో నటిస్తోంది. అలాగే కోలివుడ్‌లో సూర్యతో కలిసి 41వ చిత్రంలో హీరోయిన్‌గా నటించే చాన్స్ కొట్టేసింది. ఇక కృతికి సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు లెటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. అయితే చిన్నవయసులోనే కృతి పలు భాషలు మాట్లాడుతుండటంతో అందరూ షాక్ అవుతున్నారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తుళు మాట్లాడతానని.. కన్నడ కూడా అర్థమవుతుందని.. తమిళం నేర్చుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.ఇక సినిమాల్లోకి రాకముందు పలు యాడ్స్ లో మెరిసిన ఈ బ్యూటీ గ్లామర్ షో కంటే కూడా ట్రెడీషనల్ కే ఎక్కవగా ప్రియారిటీ ఇస్తోంది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమాలో స్టూడెంట్ గా కూడా కనిపించింది. ఇక అయితే కృతి అందానికి.. నటనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి అందరినీ ఆకట్టుకుంటోంది.