Lipstick : లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి… అవి ఏంటో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lipstick : లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి… అవి ఏంటో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :3 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Lipstick : లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి... అవి ఏంటో తెలుసా...!!

Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు మృదువుగా మార్చడానికి వాడతారు. దీంతో పెదవులు అనేవి ఎప్పుడు హైడ్రేట్ గా ఉంటాయి. అలాగే తేమ గా మరియు అందంగా కూడా కనిపిస్తాయి. అయితే ఈ లిప్ స్టిక్ అనేది ఒక సౌందర్య సాధనం మాత్రమే కాదు. ఈ లిప్ స్టిక్ మహిళలకు ఆత్మ విశ్వాసాన్ని మరియు ఆకర్షణ ను పెంచుతుంది అని పలు అధ్యయనంలో కూడా తేలింది. అందుకే లిప్ స్టిక్ పెట్టుకునే వారు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంటారు అని అంటారు. అయితే కొన్ని లిప్ స్టిక్స్ అనేవి మాయిశ్చరైజింగ్ మరియు సన్ స్కిన్ గుణాలను కలిగి ఉండడం వలన అవి పెదాలను సూర్యరశ్మి మరియు గాలి, దుమ్ము నుండి రక్షిస్తుంది. అలాగే షార్ప్ మరియు బోల్డ్ డ్రామాటిక్ కలర్స్ లేక నాచురల్ లిప్ స్టిక్ లాంటివి మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అలాగే మీరు పదిమందిలో ఆకర్షణీయంగా కనిపించేలా కూడా చేస్తుంది.

Lipstick లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసా

Lipstick : లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి… అవి ఏంటో తెలుసా…!!

ఈ లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన ముఖం కూడా సన్నగా కనిపిస్తుంది. అలాగే లావుగా ఉన్నవారికి ఇదొక ఉపశమనంలా అనిపిస్తుంది. అందుకే ముఖంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు లిప్ స్టిక్ ను వాడితే మంచిదని అంటున్నారు నిపుణులు. అలాగే మీ చర్మం యొక్క రంగును బట్టి కూడా లిప్ స్టిక్ ను వాడడం వలన పెదవులు అనేవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మీ చర్మ సౌందర్యం అనేది ఎంతో రెట్టింపు అయినట్టు కూడా అనిపిస్తుంది. అలాగే ఎంతో ఆరోగ్యంగా కూడా కనిపిస్తారు. అలాగే పెదవులను ఎండ మరియు వేడి నుండి రక్షించడంలో లిప్ స్టిక్ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. దీంతో పెదవులనేవి పొడిబారకుండా ఉంటాయి. అంతేకాక యువీ కీరణాల ప్రభావం పెదవులపై పడకుండా కూడా చూస్తుంది…

ఈ లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కళ్ళకు కూడా అందం వస్తుందంట. లిప్ స్టిక్ ను వాడటం వలన కళ్ళపై ఎదుటి వారి ఫోకస్ పెరిగి కళ్ళు పెద్దవిగా మరియు ఎంతో అందంగా కనిపిస్తాయట. అయితే కొన్ని రకాల రసాయనాలు కలిగినటువంటి లిప్ స్టిక్ లు మాత్రం అలర్జిని కలిగిస్తాయి. దీని వలన పెదవులపై ఎరుపు మరియు వాపు లేక దురద వస్తుంది. మీకు కనుక అలర్జీ వచ్చినట్టు అనిపిస్తే లిప్ స్టిక్ ను వాడడం ఆపి వెంటనే వైద్యులను సంప్రదించండి. అలాగే సహజ పదార్థాలతో తయారుచేసిన మరియు సీసం లేని లిప్ స్టిక్ ను మాత్రమే వాడడం ఉత్తమం

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది