Prabhas : ఇదెక్కడి విడ్డూరం… ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ కే’ లో మహేష్, సూర్యలు ఉన్నారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ఇదెక్కడి విడ్డూరం… ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ కే’ లో మహేష్, సూర్యలు ఉన్నారా?

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2022,7:30 pm

Prabhas : ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరి నుండి కూడా ప్రాజెక్టు కే సినిమా లో ఎవరు నటిస్తున్నారు అంటే వెంటనే సమాధానం వచ్చేస్తుంది. ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో అమితాబచ్చన్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేలు ఇంకా దిశా పటాని నటిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ గూగుల్ లో మాత్రం మరో ముగ్గురు స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు అంటూ ఫలితం చూపిస్తుంది. గూగుల్లో ప్రాజెక్ట్ కే అని టైప్ చేస్తే హీరోగా ప్రభాస్ హీరోయిన్ గా దీపిక పదుకొనే ఫోటోలను చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ముఖ్య పాత్రలో అమితాబచ్చన్, దిశా పటాని, మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్, తమిళ్ స్టార్ నటుడు సూర్య నటిస్తున్నట్లుగా గూగుల్ చెబుతోంది.

సాధారణంగా గూగుల్ ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది. కానీ ఈ విషయంలో తప్పుడు సమాచారం ఇస్తుందా లేదంటే నిజంగానే వీరు సినిమాలో నటిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది. ఒకవేళ వీరి ముగ్గురు కూడా సినిమాలో కనిపిస్తే కచ్చితంగా అది అద్భుతమే అవుతుంది. మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ హీరో ప్రాజెక్టు కే సినిమాలో కనిపించడం వల్ల ఆ సినిమా స్థాయి 10 రెట్లు పెరుగుతుంది. ఇక ఇటీవల సీతారామం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ దక్కే అవకాశం ఉంది.

mahesh babu and suriya in Prabhas project k movie

mahesh babu and suriya in Prabhas project k movie

ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సక్సెస్ ని దక్కించుకుంటూ ఎన్నో అవార్డులను మరియు రివార్డులు పొందుతున్న తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఈ సినిమాలో నటిస్తే కూడా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఈ ముగ్గురు ప్రాజెక్టు కే సినిమాలో నటించి ఉండరు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్లో ఏదో తప్పుడు సమాచారం చూపిస్తుందని త్వరలోనే ఈ తప్పుడు సమాచారంను వారు సరి చేస్తారేమో చూడాలి. మహా నటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది