Unstoppable : బాలయ్య షోకు అతిథిగా రాబోతున్న మహేష్ బాబు.. TRP రేటింగ్ బద్దలే
Unstoppable నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా భారీ విజయంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ గా నిలిచిన ఈ సినిమాపై సామాజిక మాధ్యమాల్లో అభిమానుల రచ్చ చూస్తుంటే.. వసూళ్లు సింహా, లెంజెండ్ చిత్రాలను మించిపోతాయేమో అనిపించక మానదు. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే అనే టాక్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ కార్యక్రమం రోజురోజుకు రికార్డులు సృష్టిస్తోంది. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఏకంగా నాలుగు మిలియన్లకు పైగా లైక్‌లు, వ్యూస్ తో ఈ షో ఇటీవల సరికొత్త రికార్డును సృష్టించింది.
మొదటి ఎపిసోడ్‌లోనే విలక్షణ నటుడు మోహన్ బాబుతో సందడి చేసిన బాలయ్య.. రెండో ఎపిసోడ్‌లో యువ నటుడు నానితో గోల గోల చేశాడు. బ్రహ్మానందంతో రాబోయే మూడో ఎపీసోడ్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇదిలా ఉండగా బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కొత్త ఎపిసోడ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు ఈ షోకు అతిథిగా రాబోతున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

mahesh babu In balakrishna ott show unstoppable with nbk
Unstoppable నెక్స్ట్ గెస్ట్ గా మహేష్ బాబు..
అయితే ఇది ఇప్పుడే కాదట. వచ్చే అయితే ఎపిసోడ్లో మహేష్ బాలయ్య ఒకే స్టేజీపై హంగామా చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ ఏపిసోడ్ షూట్ డిసెంబరు 4న జరగనుందని సమాచారం. ఇదే నిజమైతే షో లో బాలయ్య మహేష్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. ఏయే విషయాలపై చర్చిస్తారు అనేది ఇప్పుడు టాలీవుడ్ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. మహేష్ ఇటీవలే జూ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో పాల్గొన్నారు. డిసెంబరు 4న ప్రసారం కానున్న ఈ ఏపీసొడ్ ప్రోమో ఇప్పటికే వైరల్ అయింది.