Mahesh babu : మహేష్ బాబు ఛాన్స్ ఇస్తే ఆ దర్శకుడు ఇక టాలీవుడ్ లో దున్నేస్తాడు..!
Mahesh babu : మహేష్ బాబు ఛాన్స్ ఇస్తే సినిమా చేయాలని యంగ్ డైరెక్టర్స్ దగ్గర్నుంచి.. స్టార్ డైరెక్టర్స్ వరకు..అలాగే ఆయనతో గతంలో సినిమాలు చేసిన దర్శకులు ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. కాని మహేష్ బాబు మాత్రం ఒక్కో ప్రాజెక్ట్ ని ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. యంగ్ డైరెక్టర్స్ కి ఎక్కువ అవకాశాలిస్తున్నాడు. వాళ్ళతోనే సినిమాలు చేస్తూ వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి తో గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అదే ఊపుతో ఇప్పుడు గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన పరశురాం తో సినిమా చేస్తున్నాడు.
సర్కారు వారి పాట అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 27వ సినిమాగా రూపొందుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. 14 రీల్స్ ప్లస్.. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. దాంతో మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.
Mahesh babu : మహేష్ బాబు ఛాన్స్ ఇస్తాడా అన్నది అనుమానమే..?
కాని ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి ఇంకా చాలా సమయం పడుతున్న కారణంగా ఈ లోపు మరొక సినిమా చేయడానికి మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు దర్శకులు మహేష్ బాబు తో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్ లో శ్రీను వైట్ల కూడా వచ్చి చేరాడు. మహేష్ బాబు తో దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన శ్రీనువైట్ల అ తర్వాత ఆగడు సినిమాతో భారీ డిజాస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. అయితే ఇప్పటికే మహేష్ బాబు కోసం శ్రీను వైట్ల కథ రెడి చేసి పెట్టుకున్నాడట. అయితే మహేష్ బాబు ఛాన్స్ ఇస్తాడా అన్నది అనుమానమే అంటున్నారు. ఇస్తే గనక ఇక ఈ డైరెక్టర్ మళ్ళీ ఫాం లోకి వచ్చేస్తాడని అంటున్నారు.