Mahesh Babu : మహేశ్ బాబునే చాలా బాధపెట్టేసిందట.. ఏడ్చాడట కూడా.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో. ఆయన సినిమాలో నటించాలనే కోరిక ఏ హీరోయిన్ కు ఉండదు చెప్పండి. అందులోనూ అందగాడు. మహేశ్ బాబుతో స్టార్ హీరోయిన్లు అందరూ పనిచేశారు. అందరూ ఆయనతో నటించారు. కానీ.. ఆయనతో నటించిన ఓ హీరోయిన్ మాత్రం మహేశ్ ను చాలా బాధపెట్టిందట. ఒకానొక సందర్భంలో మహేశ్ బాబు ఏడ్చాడట కూడా. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు. ఎందుకు మహేశ్ బాబు ఏడ్చాడో తెలుసుకుందాం రండి.

mahesh babu suffered alot because of heroine keerthy reddy
మీకు అర్జున్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో మహేశ్ బాబుకు చెల్లిగా నటించిన కీర్తి రెడ్డి గుర్తుందా? ఆ సినిమాలోనే కీర్తి రెడ్డి చెల్లిగా నటించడం కాదు. సినిమా తర్వాత కూడా కీర్తి రెడ్డి ఎప్పుడూ మహేశ్ ను అన్నయ్య గానే భావించిందట. ఆ తర్వాత ప్రతి రాఖీ పండక్కి కీర్తి రెడ్డి మహేశ్ బాబుకు రాఖీ కట్టేదట. అలా.. అర్జున్ సినిమాతో కీర్తి రెడ్డి, మహేశ్ మధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత.. కీర్తి రెడ్డి.. అక్కినేని వారసుడు సుమంత్ ను పెళ్లి చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అయితే.. వాళ్లిద్దరూ విడిపోవడం.. మహేశ్ బాబుకు అస్సలు ఇష్టం లేదట. వాళ్లకు చాలాసార్లు నచ్చజెప్పి చూశాడట. వాళ్లిద్దరూ విడిపోయినందుకు చాలా బాధపడ్డాడట మహేశ్ బాబు.

mahesh babu suffered alot because of heroine keerthy reddy
Mahesh Babu : మహేశ్ బాబు చెప్పినా కూడా వినని కీర్తి రెడ్డి
తనను సొంత అన్నగా భావించే కీర్తి రెడ్డి.. సుమంత్ విషయంలో మాత్రం మహేశ్ బాబు మాట కూడా వినలేదట. సుమంత్ తో అస్సలు కలిసి ఉండనని కరాఖండిగా చెప్పేసిందట. దీంతో మహేశ్ బాబు చాలా బాధపడ్డాడట. ఒకానక సందర్భంలో ఏడ్చాడట కూడా. తన మనసును కీర్తి రెడ్డి చాలా బాధపెట్టి వెళ్లిపోయి.. ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు యూఎస్ లో సెటిల్ అయింది కీర్తి రెడ్డి.