Jabardasth : జబర్దస్త్ 10 ఏళ్ల సెలబ్రేషన్స్ ఎలా జరుగబోతున్నాయో తెలుసా..!!
Jabardasth : జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 10 సంవత్సరాలు కాబోతుంది. 2013 ఫిబ్రవరి 7వ తారీఖున మొదటి ఎపిసోడ్ ఈటీవీలో టెలికాస్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏకధాటిగా జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుని ఒకానొక సమయంలో ఇండియాలోనే టాప్ కామెడీ షో గా నిలిచింది జబర్దస్త్ కార్యక్రమం యొక్క 10 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో మల్లెమాల వారు భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో మల్లెమాలలో చేసిన వారు, జబర్దస్త్ కోసం కనిపించిన వారు, యాక్ట్ చేసిన వారు ఇలా ప్రతి ఒక్కరిని కూడా 10 సంవత్సరాల వేడుకలు భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారట.
అందుకోసం ముందస్తుగానే ఒక భారీ ఈవెంట్ ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ఎపిసోడ్ లో భాగంగా టెలికాస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. జబర్దస్త్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ధనరాజ్, చమ్మక్ చంద్ర, వేణు ఇలా మొదటి తరం కమెడియన్స్ మొదలుకొని మొన్నటి వరకు ఉన్న ఆది, సుడిగాలి సుదీర్ వంటి వారిని కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మెగా ఈవెంట్ కు గాను మల్లెమాల వారు దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మల్లెమాల వారు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా భారీగా లాభాలను సొంతం చేసుకున్నారు. అందుకే జబర్దస్త్ కార్యక్రమం యొక్క పది సంవత్సరాల వేడుకను అంతే వైభవంగా నిర్వహించాలని వారు భావిస్తున్నారట.
ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, గతంలో వర్క్ చేసిన జడ్జిలు ఇలా ప్రతి ఒక్కరిని కూడా జబర్దస్త్ 10 సంవత్సరాల వేడుకలో భాగస్వామ్యం చేయబోతున్నారు. వారు అందుబాటులో లేకుంటే వీడియో బైట్ ద్వారా వారితో మాట్లాడించడం చేయబోతున్నారట. మొత్తానికి జబర్దస్త్ 10 సంవత్సరాల వేడుక రెండు ఎపిసోడ్స్ ఈటీవీ లో టెలికాస్ట్ కాబోతుంది. జబర్దస్త్ యొక్క జర్నీ మొత్తాన్ని అందులో చూపించబోతున్నారు. జబర్దస్త్ ప్రారంభంలో ఉన్న కమెడియన్స్ మధ్యలో జాయిన్ అయిన కమెడియన్స్ వారి యొక్క మార్పు అన్నింటిని కూడా అందులో చూపిస్తారట.