Mangli : నా గురుడు నన్నింకా యోగిగమ్మననే… రాజా భోగిగమ్మననే…!
Mangli :ప్రముఖ గాయిని సత్యవతి కాని తనని ఈ పేరు తో ఎవరు గుర్తు పట్టకపోవచ్చు. ఇప్పుడు మంగ్లీ అనే పేరుతో మోస్ట్ పాపులర్ సింగర్ గా పేరు సంపాదించుకుంది. తను ఒక టీవీ వాఖ్యాతగా, జానపద, సినీ గాయని గా, సినీ నటిగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.ఒక జానపద కళాకారిణిగా 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తను కైవసం చేసుకుంది. చదువు పట్ల ఉన్న ఇష్టం తో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహాయం తో చదువుకుంది.అలా ఒక వైపు చదువుకుంటూనే పాటలు పాడటం నేర్చుకుంది.సంగీతం మీద ఉన్న ఆసక్తి తో తిరుపతిలో
కర్నాటక సంగీతం నేర్చుకుంది.
లైఫ్ లో ప్రతి ఒకరికీ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అలాంటి అవకాశం RTD సహాయం తో సంగీతం పై పట్టు సాదించడానికి తిరుపతిలోని సంగీత విద్యాలయంలో చేరి ఎంతో కష్టపడింది. పల్లె పాటలకు తెలంగాణ యాస లో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకు వచ్చింది. తీన్మార్ ప్రోగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటరై జనాలకు చేరువైంది. బిక్షు నాయక్ అనే జానపద గాయకుడి సహకారంతో యాంకర్ గా మారింది. సత్యవతి అనే పేరు కు బదులుగా మంగ్లీ అనే పేరుతోనే ‘మాటకారి మంగ్లీ’ అనే కార్యక్రమం, తీన్మార్,తీన్మార్ న్యూస్ తో మంగ్లీ పేరు తెలంగాణా లోని గల్లీ గల్లీ కి పాకేలా చేసుకుంది. దాని ద్వారా ప్రజలకు మరింత చేరువైంది .
Mangli : తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన “రేలా……రేలా….రే.”
తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన “రేలా……రేలా….రే.” పాట మంగ్లీని గొప్ప సెలబ్రటీ సింగర్ గా నిలబెట్టింది. ఆ తర్వాత బతుకమ్మ పాట,గణేశ్ చతుర్థి, బోనాలు పాట ఇలా రకరకాల పాటలతో మళ్ళీ మళ్ళీ ప్రజల మదికి చేరువవుతూనే వస్తుంది.రీసెంట్ గా శివరాత్రి రోజు ఈషా ఫౌండేషన్ వారు నిర్వహించిన భక్తిరస కార్యక్రమంలో కూడా పాటలు పాడి తన భక్తిని చాటుకుంది. నా గురుడు నన్నింకా యోగిగమ్మననే….అంటూ ఆలపించిన పాట తో అందరిలో శివతత్వాన్ని నింపేసింది. ఆ కార్యక్రమంలో భక్తుల మదిని తన్మయత్వంలో ఊగిసలాడేలా చేసింది. జానపద పాటలు కనుమరుగవుతున్న ఈ
రోజులలో ఆ పాటలకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.