Meera Jasmine : రెచ్చిపోతున్న మీరా జాస్మిన్.. అందాల ఆరబోత మాములుగా లేదు..!
Meera Jasmine : మీరా జాస్మిన్.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి. ఈ అమ్మడు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును కూడా కైవసం చేసుకుంది. తెలుగులో బాలకృష్ణ,పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. మీరా జాస్మిన్ 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తిరువల్లలో జన్మించారు. మీరా జాస్మిన్ అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్. మీరా జాస్మిన్ తల్లి తండ్రులు జోసెఫ్, అలయమ్మ,.. తల్లి తండ్రులకు ఐదుగురి సంతానంలో ఈమె నాల్గవది. మీరా జాస్మిన్‌కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. వీళ్లిద్దరు సోదరిమణులు కూడా సినిమాల్లో నటించారు. ఒక సోదరుడు జార్జ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
Meera Jasmine : మీరా అందానికి ఫిదా కావల్సిందే..
మీరా జాస్మిన్ పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది . అమాయకత్వంతో నిండిన పాత్రలు చేయాలంటే అప్పట్లో మీరా జాస్మిన్ ఫస్ట్ ఆప్షన్. తన అభినయం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది ఫాలోవర్స్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కేరళ కు చెందిన ఈ నటి ఎక్స్‌పోజింగ్‌కు ఎప్పుడూ దూరమే. 2001-2010 కాలంలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. తెలుగు, తమిళ , మలయాళం భాషల్లో నటించిన జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. ఫేమస్ డైరెక్టర్ లోహిత్ దాస్‌కు మీరాని పరిచయం చేసి మలయాళం మూవీ ‘సూత్రధారన్’లో ఛాన్స్ ఇప్పించాడు. ఆ తర్వాత మీరాకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.
2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ‘మీరా జాస్మిన్’. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అందాల ముద్దుగుమ్మ తెగ రచ్చ చేస్తుంది. క్యూట్ క్యూట్ అందాలతో కేక పెట్టిస్తూ కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తుంది.