Mega Family Heroes : చిరు, పవన్, చరణ్‌ ల రెమ్యూనరేషన్స్‌ లో ఎవరిది ఎక్కువ తెలుసా?

Advertisement

Mega Family Heroes : టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారు చాలా మంది ఉన్నారు అనే విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంకా మరి కొందరు హీరోలు కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు. అయితే మెగా హీరోలు ఎవరు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది మెగా ఫాన్స్ లో ఒక పెద్ద సందేహం. మెగా హీరోల్లో మాత్రమే కాకుండా ఏ సినిమా హీరో అయినా తాను చేస్తున్న కథ కు మరియు కేటాయిస్తున్న డేట్స్ కి ఇంకా తన యొక్క స్టార్‌డమ్ కి అనుగుణంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటాడు.

Advertisement
mega family heroes remuneration interesting update
mega family heroes remuneration interesting update

ఉదాహరణకు గత సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాకుండా రామ్ చరణ్ హీరోగా నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా కూడా విడుదలైంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కూడా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ముగ్గురు హీరోల్లో గత ఏడాదికి గాను రామ్‌ చరణ్ అత్యధిక రెమ్యూనరేషన్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది, ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. అందుకే రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటాగా రామ్ చరణ్ 100 కోట్లకు పైగా ఆ సినిమా ద్వారా పొందాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

Advertisement
mega family heroes remuneration interesting update
mega family heroes remuneration interesting update

ఇక పవన్ కళ్యాణ్ గత ఏడాది దాదాపు 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ దక్కించుకున్నాడట. చిరంజీవి కూడా ఆచార్య సినిమా కు దాదాపుగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ సొంతం చేసుకున్నాడు అనేది టాక్. మొత్తానికి మెగా హీరోల్లో ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కరిది పై చేయి అవుతుంది. మొన్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది, కనుక చిరంజీవి ఈ సంవత్సరం తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచే అవకాశాలున్నాయి. సక్సెస్ మరియు ఫ్లాప్ ఇంకా సినిమాకు కేటాయించే డేట్స్ ని బట్టి ఏ హీరో అయినా రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. కనుక ఒక హీరో రెమ్యూనరేషన్ ఇంకో హీరో కంటే ఎక్కువ లేదా తక్కువ అని అనుకోవడానికి లేదు.

Advertisement
Advertisement