Mega star : ముళ్ళ బాటని పూల బాటగా మార్చిన విజేత: మెగాస్టార్
Mega star : కొణిదెల శివశంకర వరప్రసాద్.. పునాది రాళ్ళు సినిమాతో గట్టి పునాది వేసుకొని చిరంజీవిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. 60 ఏళ్ళు దాటిపోయినా అదే ఛరిష్మా..అదే వేడి అదే వాడి మెగాస్టార్ చిరంజీవిది. ముళ్ళ బాటని పూల బాటగా మార్చుకొని తను ఎన్నో కష్టాలు అనుభవించి తన వారికి సుఖాలను అందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ‘నేనున్నాను’ అంటూ చేయూతనిస్తున్నారు. మెగా ఫ్యామిలీ అనే మహా వృక్షం నీడలో తన కుటుంబానికే కాదు..తెలుగు సినిమా ఇండస్ట్రీ అయిన పెద్ద కుటుంబానికి అన్నీ ఆయనే అయ్యారు. అరవైలో కూడా ఇరవై ఏళ్ళ కుర్రాడిగా సినిమాలను ఒప్పుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులను.. యావత్ సినీ ప్రేమికులకు టన్నుల్లో ఉత్సాహాన్ని ఇస్తున్నారు.
ఒకే సంవత్సరం పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు.. సినిమాలు చేశారు. అయితే పునాది రాళ్ళు సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు 1978 లో, మన ఊరి పాండవులు రిలీజయ్యాయి. 1979లో పున్నాది రాళ్ళు విడుదలయి 5 నంది అవార్డులు గెలుచుకుంది. అప్పటి నుంచి చిరంజీవి కెరీర్ లో ఇప్పటి వరకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రాజకీయాల పరంగా ఆయన ఓ పదేళ్లు సినిమాలకి దూరంగా ఉన్నారు. కానీ తనయుడు రాం చరణ్ సినిమాలలో మెరుస్తూ జస్ట్ టైం గ్యాప్ ..టైమింగ్ లో అస్సలు గ్యాప్ ఉండదంటూ ఇన్‌డైరెక్ట్‌గా నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నానంటూ హింట్ ఇస్తూ వచ్చారు.
స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ విజేతగా నిలిచారు. ఆయన సినిమాలు అన్నీ వాస్తవ సంఘటనల ఆధారంగా, నిజ జీవిత పాత్రలకి దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. అందుకే నేటి తరానికి మెగాస్టార్ ఓ డిక్షనరీ. ఇండస్ట్రీ వర్గాలలోని వారినే కాదు సామాన్య ప్రేక్షకులను తన దారిలో నడిచేలా చేశారు. అందరికీ అన్నయ్యగా మెగాస్టార్ ఎంతో ప్రేమాభిమానాలను పంచుతున్నారు. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉంటూనే, అనుకునట్టుగానే దాదాపు పదేళ్ల తర్వాత గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి ఏ ఒక్కరు ఊహించని విధంగా సినిమాలను కమిటవుతున్నారు.
ప్రస్తుతం సీనియర్ హీరోలలో దూకుడుగా సినిమాలు చేస్తుందంటే మెగాస్టారే. నేడు ఆగస్ట్ 22 ఆయన బర్త్ డే సందర్భంగా విజేతగా నిలిచిన మెగాస్టార్‌కి కొన్ని కోట్ల మంది అభిమానులు సంబరాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రతీ సంవత్సరం మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.