Trivikram : త్రివిక్ర‌మ్‌కి వార్నింగ్ ఇచ్చిన మిర్చి విల‌న్.. సెట్స్‌కి వ‌చ్చి కెమెరా ఎత్తుకుపోతానంటూ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trivikram : త్రివిక్ర‌మ్‌కి వార్నింగ్ ఇచ్చిన మిర్చి విల‌న్.. సెట్స్‌కి వ‌చ్చి కెమెరా ఎత్తుకుపోతానంటూ…!

 Authored By sandeep | The Telugu News | Updated on :26 January 2022,1:00 pm

Trivikram : సంప‌త్ రాజ్.. ఆయ‌న మ‌ర్చి సినిమాతో పాపుల‌ర్ యాక్ట‌ర్‌గా మారాడు. ఈ సినిమా త‌ర్వాత నుండి ఆయ‌న‌కు విల‌న్‌గా, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌గా చాలా అవ‌కాశాలు అందుకున్నాడు. తెలుగులో పాపుల‌ర్ యాక్ట‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్న సంప‌త్ రీసెంట్‌గా ఆలీతో స‌ర‌దాగా షోకి హాజ‌ర‌య్యాడు. ఆయ‌న అనేక ఆస‌క్తిక‌ర సంగ‌తులు షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ కి వార్నింగ్ ఇచ్చానంటూ ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది. హోస్ట్ ఆలీ ఓ స్టార్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చావట? సెట్స్ కి వచ్చి కెమెరాలు ఎత్తుకుపోతా అన్నావట? అని అడుగగా అవునని సంపత్ ఒప్పుకున్నారు. ఆయ‌న త్రివిక్ర‌మ్ అని కూడా తెలియ‌జేశారు.ఐతే దర్శకుడు త్రివిక్రమ్ కి సంపత్ రాజ్ ఇచ్చింది సీరియస్ వార్నింగ్ కాదులెండి.

తనను మర్చిపోకుండా మంచి ఆఫర్ ఇవ్వాలంటూ అలా సరదా వార్నింగ్ ఇచ్చాడన్న మాట. త్రివిక్రమ్ తో సంపత్ కి మంచి రిలేషన్ ఉంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి చిత్రాలలో సంపత్ విలన్ రోల్స్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఇలాంటి ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది.త‌న కుటుంబం గురించి చెప్తూ.. ‘మా నాన్న పెళ్లిచూపుల కోసం యూనిఫామ్‌లో వెళ్లిన‌ప్పుడు అమ్మ ఇల్లు కడుగుతోంద‌ట‌. ఆమెను చూసి ఎవ‌రో ప‌నిమ‌నిషి అనుకున్నాడ‌ట‌. ఆయ‌న్ను చూడ‌గానే అమ్మ ప‌రుగెత్తుకుంటూ లోప‌ల‌కు వెళ్లి పోలీసులొచ్చార‌ని చెప్పింది. అలా వాళ్ల మొద‌టి ప‌రిచ‌యం జ‌రిగింది. మా పేరెంట్స్‌కు మేము ఏడుగురం సంతానం.

mirchi villain warns to trivikram

mirchi villain warns to trivikram

Trivikram : ఉట్టి ఉట్టి బెదిరింపులు..

అందులో నేను ఆఖ‌రివాడిని’ అని చెప్పుకొచ్చాడు.ఆర్టిస్టు శ‌ర‌ణ్య‌, ఆమె ఫ్యామిలీ.. త‌న‌కు, త‌న కుటుంబానికి చాలా క్లోజ్ అన్న సంప‌త్‌ ఆమెతో క‌లిసి ఒక సినిమాలో న‌టించాన‌ని తెలిపాడు. అయితే ఆ మాత్రం దానికే ఆమెను త‌న‌ మాజీ భార్యగా పేర్కొంటూ అస‌త్య‌పు వార్త‌లు రాశార‌ని, అందులో ఎలాంటి నిజం లేద‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌ త‌ల్లికి సినిమాలంటే ఇష్టం లేక‌పోవ‌డంతో తండ్రే ఇంటి నుంచి పారిపోమ‌ని స‌ల‌హా ఇచ్చార‌ని తెలిపాడు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది