Mokshajna : నందమూరి ఫ్యాన్స్ కి Goosebumps తెప్పించే బ్రేకింగ్ న్యూస్ : మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోయేది ఈ డైరెక్టర్ తోనే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mokshajna : నందమూరి ఫ్యాన్స్ కి Goosebumps తెప్పించే బ్రేకింగ్ న్యూస్ : మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోయేది ఈ డైరెక్టర్ తోనే !

 Authored By aruna | The Telugu News | Updated on :14 June 2023,11:00 am

Mokshajna : నటసింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అంతకుముందు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు అని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. కొన్నాళ్లకు మోక్షజ్ఞకు అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మోక్షజ్ఞ లుక్స్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాయి. పూర్తిగా హీరోలాగా మోక్షజ్ఞ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞ ఫారిన్లో నటన, డ్యాన్స్ పై ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ఆమధ్య మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలకృష్ణ స్పందించారు. అయితే మోక్షజ్ఞ తో సినిమా ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 తో ఉంటుందని అనుకున్నారు. ఆ సినిమాను బాలకృష్ణ స్వయంగా డైరెక్ట్ చేసి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సో అది జరిగేటట్లు కనిపించడం లేదు. ఈలోగా మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యారట. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమా ఏ డైరెక్టర్ కి అప్పగిస్తాడు అన్నది చర్చగా మారింది.

Mokshajna cine entry with that director

Mokshajna cine entry with that director,

అయితే బోయపాటి శ్రీను, క్రిష్ లాటి డైరెక్టర్ లు రేసులో ఉన్నారు. కానీ బాలకృష్ణ ఇంట్రెస్ట్ మొత్తం పూరీ జగన్నాథ్ మీద ఉంటదని తెలుస్తోంది. రామ్ చరణ్ తొలి సినిమా పూరి జగన్నాథ్ తోనే జరిగింది. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా పూరీ జగన్నాథ్ తో జరిపియాలని చూస్తున్నాడు. అయితే అప్పుడు పూరి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన అంతగా సక్సెస్ లో లేడు. మోక్షజ్ఞ ఎంట్రీ పూరితో అంటే కొంచెం రిస్క్ అని అంటున్నారు. కానీ పూరితో సినిమా అంటే హీరో క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే పూరీ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా చేస్తే ఫ్యాన్స్ కి ఎక్కువగా రీచ్ అవుతుందని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది