Shobhan Babu : శోభ‌న్ బాబు కావాల‌నే నా సినిమాను రిజెక్ట్ చేశారు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shobhan Babu : శోభ‌న్ బాబు కావాల‌నే నా సినిమాను రిజెక్ట్ చేశారు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్‌..!

 Authored By mallesh | The Telugu News | Updated on :15 November 2021,7:15 am

Shobhan Babu : శోభ‌న్ బాబు అంటే ఆ కాలంలో అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆంధ్రా సోగ్గాడిగా సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వ్య‌క్తి శోభ‌న్ బాబు. ఆయ‌న ఓ జాన‌ర్ సినిమాల‌కు బాగా సూట్ అయ్యేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయాలంటే అంద‌రి డైరెక్ట‌ర్లుకు ముఖ్యంగా గుర్తుకు వ‌చ్చే పేరు శోబ‌న్ బాబు మాత్ర‌మే.

అంత‌లా ఆయ‌న ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ఒ సినిమా విష‌యంలో శోభ‌న్ బాబు కావాల‌నే తిర‌స్క‌రించార‌ని ప్ర‌స్తుత నిర్మాత ఎమ్మెస్ రాజు చెప్పుకొచ్చారు.తాను నిర్మాత‌గా మొద‌టి సినిమా తీసేందుకు శోభ‌న్ బాబును హీరోగా పెట్టి శత్రువు సినిమా చేయాల‌ని అనుకున్నారంట‌. కానీ దీన్ని శోభ‌న్ బాబు తిర‌స్క‌రించ‌డంతో చివ‌ర‌కు వెంకటేష్ తో తీసి స‌క్సెస్ సాధించారంట‌.

MS Raju About shobhan babu

MS Raju About shobhan babu

Shobhan Babu మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తాయ‌నే…!

అయితే ఇంత మంచి మూవీని శోభ‌న్ బాబు రిజెక్ట్ చేయడానికి కార‌ణం కూడా ఉంద‌ని ఎమ్మెస్ రాజు చెప్పుకొచ్చారు. తాను నిర్మాత కావ‌డం శోభ‌న్ బాబుకు ఇష్టం లేద‌ని అందుకే వేరే ఏదైనా బిజినెస్ చేసుకోమంటూ స‌ల‌హాలు ఇచ్చారంట‌. ఒక‌వేళ శ‌త్రువు మూవీ ప్లాప్ అయితే మనస్పర్ధలు వస్తాయంటూ చెప్పారంట‌. కానీ ఎమ్మెస్ రాజు మాత్రం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోక వెంకటేష్ తో త‌న మూవీ చేపించారంట‌. అనూహ్యంగా ఆ మూవీ స‌క్సెస్ సాధించిది.

ఈ మూవీని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేయ‌గా రాజ్ కోటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా చేశారు. ఇలా తాను అనుకున్న‌ది సాధించారంట ఎమ్మెస్ రాజు. ఇక ఇదే సినిమాతో వెంక‌టేశ్ తిర‌గి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ మూవీతోనే రాజు నిర్మాతగా ప‌రిచ‌యం అయ్యారు. ఇప్ప‌టికీ ఆయ‌న సినిమాలు చేస్తూనే ఉన్నారు. త‌న కెరీర్‌ను శోభ‌న్ బాబుతో స్టార్ట్ చేద్దామ‌నుకుని చివ‌ర‌కు వెంక‌టేశ్‌తో చేశానంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు.

 

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది