Nabha Natesh : స్లీవ్ లెస్ టాప్‌లో.. మత్తెక్కించే చూపులతో.. వగలమారి హోయలు పోతున్న నభా నటేశ్
Nabha Natesh : అందాల ముద్దుగుమ్మ నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇకపోతే ఈ భామ ఆ తర్వాత నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.. ఈ భామకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ‘ఇస్మార్ట్’ చాందినిగా నభా నటేశ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.నభా నటేశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఈ పాతికేళ్ల భామ ట్విట్టర్ వేదికగా గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో కిల్లర్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. వంకాయ రంగు డ్రెస్‌లో స్లీవ్ లెస్ టాప్‌తో.. భారీ ఎద అందాలు చూపుతూ నెట్టింట అగ్గి రాజేస్తున్నది నభా. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ గర్ల్ అని కామెంట్స్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న నభా నటేశ్.. టాప్ హీరోయిన్ తప్పక అవుతుందని అంటున్నారు. నభా నటేశ్ నటించిన ‘మాస్ట్రో’ ఫిల్మ్ ఇటీవల ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్ వేదికగా విడుదలైంద.
Nabha Natesh : ఎద అందాలు చూపుతూ.. కిల్లర్ లుక్స్‌తో కైపెక్కిస్తోన్న నభా..
ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాదున్’ రీమేక్. కాగా ఒరిజినల్ ఫిల్మ్‌లో బాలీవుడ్ హాట్ హీరోయిన్ రాధికా ఆప్టే పోషించిన పాత్రను నభా నటేశ్ తెలుగులో పోషించింది. నితిన్ హీరోగా వచ్చిన ఈ మూవీలో నెగెటివ్ రోల్‌ను మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్లే చేసింది.