వారి గురించే అలా అన్నాడా?.. చమ్మక్ చంద్రపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్
జబర్దస్త్ షోలో నాగబాబు విధేయులుగా చాలా మంది ఉన్నారు. అసలు అక్కడ ఉన్నది కూడా అందరూ మెగా అభిమానులే. నాగబాబు అంటే కొండంత భక్తితో ఉన్నవాళ్లే అని అనుకున్నారు. అందుకే నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను అని చెప్పడంతో అందరూ వెళ్లిపోతారు.. జబర్దస్త్ ఖాళీ అవుతుందని అంతా భావించారు. కానీ ఎవ్వరూ కూడా నాగబాబు వెంట వెళ్లలేదు. మరీ ముఖ్యంగా గెటప్ శ్రీను, సుధీర్, రాం ప్రసాద్, హైపర్ ఆదిలు వెళ్తారని భావించారు.

Naga babu Special Wishes To Chammak Chandra
కానీ నాగబాబు వెంట చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ మాత్రమే వెళ్లారు. అందులో కిర్రాక్ ఆర్పీని ఎవ్వరూ లెక్కలోకి తీసుకోరు. ఇక చమ్మక్ చంద్ర ఒక్కడే నాగబాబు వెంట నడిచాడు. అది నాగబాబు మీదున్న ప్రేమకు, అభిమానానికి నిదర్శనం. అందుకే నాగబాబు అంటే చమ్మక్ చంద్రకు మరింత ప్రేమ. ఈ సందర్భంగా నాగబాబు చమ్మక్ చంద్రకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆ పోస్ట్‌లో ఎన్నో రకాల గూడార్థాలున్నాయి.
హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ చమ్మక్ చంద్ర.. ఈ సమాజంలో ఎంతో మంది మాస్క్‌తో బతుకుతున్నారు.. ద్వంద్వ ధోరణిని అవలంభిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎంతో స్వచ్చంగా ఉంటావ్.. హృదయాంతరాల్లోంచి ఎంతో నిజాయితీగా ఉంటావ్… నువ్ ఈ రోజు ఇక్కడ ఉండేందుకు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు.. ఎన్ని బాధలు అనుభవించావో తెలుసు… ఇలాగే కష్టపడుతూ ఉండు.. ఎప్పుడూ ఇలాగే నిజాయితీగా ఉండూ.. నవ్వుతూ ఉండూ.. ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉండు అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మాస్క్‌తో బతకడం, రెండు నాల్కల ధోరణితో ఉండటం అంటే జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల గురంచే కామెంట్ చేశాడా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.