Naga Chaitanya : “అక్కినేని.. తొక్కినేని” అని బాలయ్య చేసిన వ్యాఖ్యలకు ఊహించని కౌంటర్ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య, అఖిల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Chaitanya : “అక్కినేని.. తొక్కినేని” అని బాలయ్య చేసిన వ్యాఖ్యలకు ఊహించని కౌంటర్ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య, అఖిల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :24 January 2023,3:40 pm

Naga Chaitanya : గత ఆదివారం హైదరాబాద్ లో “వీరసింహారెడ్డి” సక్సెస్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ సినిమా గురించి మాట్లాడుతున్నే మరోపక్క.. నాన్నగారు డైలాగులు… ఆ రంగారావు ఈ “అక్కినేని..తొక్కినేని” అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లు బాలయ్య వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

అక్కినేని తొక్కినేని అని బాలయ్య అనటంపై సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయితే ఈ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ కూడా స్పందించారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం…’ అంటూ.. ఇద్దరు అన్నదమ్ములు ప్రకటనతో కూడిన పోస్ట్ ట్వీట్ చేశారు. మరి అక్కినేని బ్రదర్స్ చేసిన పోస్ట్ పై బాలయ్య ఏ రీతిగా స్పందిస్తారో చూడాలి.

Naga Chaitanya gave an counter to Balakrishna comments

Naga Chaitanya gave an counter to Balakrishna comments

సంక్రాంతి పండుగ కానుకగా బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” సూపర్ డూపర్ హిట్ అయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా… మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించడం జరిగింది. రికార్డు స్థాయి కలెక్షన్లతో ఊహించిన రెస్పాన్స్ రావడంతో ఆదివారం “వీరసింహారెడ్డి” సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో… బాలయ్య వ్యాఖ్యలకు పరోక్షంగా అక్కినేని బ్రదర్స్ ఇచ్చిన ఊహించని కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది