Naga Babu : చమ్మక్ చంద్ర గొప్పదనం గురించి చెబుతూ ఏమోషనల్ అయిన నాగ బాబు..!
Naga Babu : చమ్మక్ చంద్ర బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని కమెడియన్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో కమెడియన్ ఎంట్రీ ఇచ్చిన చంద్ర.. అనతి కాలంలో అందరి మనసులు దోచుకున్నాడు. కడుపుబ్బ నవ్వించే స్కిట్ లతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తనకు లైఫ్ ఇచ్చి స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టిన జబర్దస్త్ షో నుంచి పలు కారణాల వల్ల జడ్జీ నాగబాబుతో సహా ఆయన బయటకు వచ్చేశారు. ఆ తర్వాత జీ తెలుగులో… అదిరింది, బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్ అంటూ ప్రయత్నాలు చేసినా షో తో పాటు చంద్ర కూడా సక్సెస్ కాలేదు.
ఇదిలా ఉండగా తాజాగా జీ తెలుగు నిర్వహించిన న్యూ ఇయర్ ఈవెంట్ లో నాగబాబు, అలీ, నిహారిక తో సహా చంద్ర పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ షో లో నాగబాబు.. చమ్మక్ చంద్ర గురించి పలు ఆసక్తికర అంశాలు చర్చించారు.చమ్మక్ చంద్ర అనేవాడు చాలా గొప్ప వ్యక్తి అంటూ.. తను బాగుంటే చాలు అనుకుంటూ.. తన తల్లిదండ్రులను వదిలేయలేదని నాగబాబు చెప్పాడు. ఊరి నుంచి అమ్మ నాన్నలను హైదారబాద్ తీసుకువచ్చి వారి కోసం ఓ ఇంటిని కట్టించాడని తెలిపారు.

Nagababu gets emotional while telling about jabardast comedian chammak chandra
Naga Babu : ఏమోషనల్ అయిన నాగ బాబు..!
స్టేజి మీదే ఆ లగ్జరీ ఇంటిని చూపిస్తూ.. ఆ ఇంటి కీ ని చంద్ర తల్లిదండ్రులకి అందించాడు. అమ్మ నాన్నలు దూరం అయ్యాకా తమ వద్ద వందల కోట్ల ఆస్తి ఉన్నా.. తనకు ఆనందంగా ఉండదంటూ వారికి ఓ ఇళ్లు కట్టించి అందులో వారిని ఓ నాలుగు రోజులు ఉంచడమే తనకు అసలైన ఆస్తి అన్నారు. నాగ బాబు వ్యాఖ్యలకు ఏమోషనల్ అయిన చమ్మక్ చంద్ర స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్నాడు.