NagaBabu : నాగబాబు ఐడియాను కాపీ కొట్టిన ఈటీవీ మల్లెమాల.. ఫుల్‌ కామెడీ పక్కా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NagaBabu : నాగబాబు ఐడియాను కాపీ కొట్టిన ఈటీవీ మల్లెమాల.. ఫుల్‌ కామెడీ పక్కా

 Authored By prabhas | The Telugu News | Updated on :9 March 2022,8:30 pm

NagaBabu : మెగా బ్రదర్ నాగబాబు కొన్నాళ్ళ క్రితం తన యూట్యూబ్ ఛానల్ లో స్టాండప్ కామెడీ అంటూ ఒక షో లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ షో కి పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ముఖ్యంగా స్టాండప్ కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నాగబాబు లో బడ్జెట్ లో, చాలా నాసిరకమైన నిర్మాణ విలువలతో ఆ షో నిర్వహించడం వల్ల ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాడు. కానీ స్టాండప్ కామెడీ అనేది అంతర్జాతీయ వేదికలపై చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.తెలుగు లో నాగబాబు దాన్ని సరిగా చేయలేక పోవడంతో ఫ్లాప్ అయ్యింది

అనేది టాక్‌. ఇప్పుడు అదే స్టాండప్‌ కామెడీ షో ను ఈటీవీ మల్లెమాల వారు కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈటీవీ ప్లస్ లో జాతిరత్నాలు అనే కామెడీ షో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇది ఒక పక్కా ఎంటర్‌ టైనర్‌ ను అందించే స్టాండప్ కామెడీ షో. శ్రీముఖి యాంకర్ గా ఈ షో ఈటీవీ ప్లస్ లో రాబోతుంది. తాజాగా ప్రోమో విడుదల చేసిన ఈ టీవీ మల్లెమాల వారు అంచనాలను భారీగా పెంచేశారు.ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో లు అన్నింటికీ కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

Nagababu idea copied in ETV Mallemala

Nagababu idea copied in ETV Mallemala

కనుక ఈటీవీ ప్లస్ లో ప్రసారం కాబోతున్న ఈ స్టాండప్ కామెడీ షో కి కూడా ఖచ్చితంగా మంచి ఆదరణ లభిస్తుందని నమ్మకం ఈ టీవీ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మల్లెమాల ప్లస్ ఈటీవీ వారు కలిసి చేసిన అన్ని షో లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కనుక ఈ జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షో కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అతి త్వరలోనే ఈ టీవీ ప్లస్ లో ప్రసారం అవుతున్న ఈ స్టాండప్ కామెడీ కి ప్రేక్షకులు ఎంత మంది నిలబడి మరీ నవ్వుతారో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది